Site icon NTV Telugu

High-Protein Foods: ప్రోటీన్లు అన్నీ ఆరోగ్యకరం కాదు.. ఈ ఐదు ప్రోటీన్ ఫుడ్స్‌ యమ డేంజర్‌..!

Protein Foods

Protein Foods

High-Protein Foods: ఎవరికి..? ఎప్పుడు..? ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో చెప్పలేని పరిస్థితి.. దీంతో, యువతతో పాటు చాలా మంది కొంత వరకు ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెడుతున్నారు.. అంతేకాదు.. ప్రోటీన్‌ ఫుడ్‌ వైపు అడుగులు వేస్తున్నారు.. తాము తినే ఫుడ్‌లో ఫ్రోట్‌న్లు ఉండేవిధంగా చూసుకుంటున్నారు.. ప్రోటీన్‌ను ఎల్లప్పుడూ ఫిట్‌నెస్ హీరో అని పిలుస్తారు. కండరాలను నిర్మించడం, బరువు తగ్గడం లేదా ఫిట్‌గా.. ఆరోగ్యంగా ఉండటం అయినా, అందరూ ఎక్కువ ప్రోటీన్ తీసుకోమని చెబుతారు.. కానీ, మీరు రోజూ తినే అధిక ప్రోటీన్‌ ఫుడ్‌.. ఎంత డేంజరో తెలుసా? అనే చర్చ ఇప్పుడు సాగుతోంది.. ఫిట్‌నెస్ కోచ్ సీన్ ఫానింగ్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రోటీన్‌ ఫుడ్‌ గురించి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.. దాని ప్రకారం.. పెరుగు, గుడ్లు, వేరుశెనగ వెన్న, ఎండిన పండ్లు, ప్రోటీన్ బార్‌లు వంటి కొన్ని సాధారణ ఆహారాలు ఆరోగ్యకరమైనవిగా అనిపించవచ్చు.. కానీ, వాస్తవానికి, అవి ఎల్లప్పుడూ అంత ప్రయోజనకరం కాదు అంటూ చెప్పుకొచ్చాడు సీన్..

మనం గుడ్డిగా తీసుకొనే కొన్ని ఆహారాలతో అధిక ప్రోటీన్‌ వస్తుందని అనుకుంటాం.. కానీ వాటిలో చాలా తక్కువ ప్రోటీన్ ఉంటుంది.. అంతే కాదు.. కొవ్వు, చక్కెర లేదా కేలరీలు ఉంటాయి, అవి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి అని సీన్ పేర్కొన్నాడు.. మీరు ఈ వస్తువులతో మీ సమయాన్ని వృధా చేస్తున్నారా? లేదా? వాటిని తెలివిగా ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా? అంటూ ఓ ప్రశ్న వేశాడు..

* గ్రీకు పెరుగు: ప్రజలు గ్రీకు పెరుగును ప్రోటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు.. కానీ, సీన్.. ప్రకారం, ఫుల్ ఫ్యాట్ పెరుగు ప్రజలు అనుకున్నంత ప్రయోజనకరంగా ఉండదు. 100 గ్రాముల ఫుల్ ఫ్యాట్ గ్రీక్ పెరుగులో కేవలం 10 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుందని, తక్కువ ఫ్యాట్ పెరుగులో దాదాపు 13 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని వివరించారు.. మీరు మీ ఆహారంలో ప్రోటీన్‌ను పెంచుకోవాలనుకుంటే, తక్కువ ఫ్యాట్ గ్రీక్ పెరుగును కొంత ప్రోటీన్ పౌడర్‌తో కలిపి తినండి. ఇది కేలరీలను తగ్గిస్తుంది మరియు ఎక్కువ ప్రోటీన్‌ను అందిస్తుందని చెప్పాడు..

* పీనట్ బటర్‌ను ప్రజలు ప్రోటీన్లలో బెటర్‌ అని అనుకునేలా చేస్తుంది. కానీ, వాస్తవం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. మీరు బొడ్డు కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే.. పీనట్ బటర్‌కు దూరంగా ఉండండి అని సీన్‌ సూచించాడు.. ఎందుకంటే పీనట్ బటర్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.. అంతేకాదు ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. దీంతో ఇది ఖచ్చితంగా బరువు పెరగడానికి దారితీస్తుందని హెచ్చరించాడు.

* గుడ్లను “సూపర్ ఫుడ్” అంటారు, అది నిజం. కానీ, ఒక గుడ్డులో కేవలం 6 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఉదయం రెండు గుడ్లు తినడం ద్వారా మీరు మీ రోజువారీ ప్రోటీన్ తీసుకోవడం పొందారని మీరు అనుకుంటే, అది పొరపాటే.. కనీసం నాలుగు లేదా ఐదు గుడ్లు తినండి అని సీన్ అంటున్నారు. అయితే, గుడ్లు మంచివే.. కానీ, సరైన మొత్తంలో మాత్రమే ప్రభావం చూపుతాయని పేర్కొన్నాడు..

* ప్రోటీన్ బార్లు మరియు తృణధాన్యాలు: ఈ రోజుల్లో, అధిక ప్రోటీన్ బార్లు, ప్రోటీన్ తృణధాన్యాలు, లేదా ప్రోటీన్ స్నాక్స్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కానీ, వీటిలో తరచుగా ప్రోటీన్ కంటే ఎక్కువ చక్కెర మరియు ప్రాసెస్ చేసిన పదార్థాలు ఉంటాయి. ప్యాకింగ్‌పై ప్రోటీన్ అని రాసినంత మాత్రాన అది ఆరోగ్యకరమైనదని అర్థం కాదు. చాలా ప్రోటీన్ బార్లు మరియు షేక్స్ తియ్యగా ఉంటాయి.. ఏదైనా బార్‌కోడ్‌తో ప్యాక్ చేయబడితే, కొనుగోలు చేసే ముందు లేబుల్‌ని తప్పకుండా చదవాలని సూచించాడు..

* డ్రై ఫ్రూట్స్‌: బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి గింజలు శరీరానికి మేలు చేస్తాయి.. కానీ, వాటిని ప్రోటీన్ మూలాలుగా పరిగణించడం పొరపాటే అంటున్నాడు.. డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్‌కు పనికిరాని చిరుతిండి ఎందుకంటే వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.. వాటిని తక్కువ పరిమాణంలో తినడం మంచిది, కానీ, మీరు వాటిని గుప్పెడుగా తింటూ ఉంటే, మీరు త్వరగా బరువు పెరుగుతారని హెచ్చరించాడు..

Exit mobile version