Site icon NTV Telugu

Hyderabad: ఓయో రూంలో ప్రేమికుల మధ్య ఘర్షణ.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం

Oyo Min

Oyo Min

రామంతపూర్ ఓయో రూంలో ప్రేమికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఓయో రూంలో సౌమ్య, ఓంకార్ అనే ప్రేమ జంట నిన్న అద్దెకు తీసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రియుడు ఓంకార్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓంకార్‌ పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌కు తరలించారు. ప్రియుడు ఓంకార్ బేగంబజార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

READ MORE: Koti Deepotsavam 2024: ఉజ్జయిని మహాకాళ్ కల్యాణం, పల్లకీ వాహన సేవ.. మూడవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే!

రామంతపూర్ ఓయో రూంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బోరబండకు చెందిన ఓంకార్ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. జనగాం కు చెందిన సౌమ్య కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ప్రైవేట్ బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్నారు. సౌమ్య ఉప్పల్ లో ప్రవేట్ హాస్టల్లో ఉంటుంది. రామంతపూర్ ప్రగతి నగర్ లోని ఓయో రూంలో ఆదివారం సాయంత్రం ప్రేమజంట రూమ్ తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రియుడు ఓంకార్ రూమ్ లో ఉన్న ఫ్యాన్ కు ప్రియురాలి చున్నీతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రియురాలు వెంటనే ఓయో సిబ్బందికి చెప్పడంతో అతనిని వెంటనే పక్కకు ఉన్న ఒక ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారు. ఇద్దరు మద్యం సేవించారని సమాచారం. ప్రస్తుతం ఓంకార్ రామంతపూర్ మాట్రిక్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. హాస్పిటల్లో ఉన్న ఓంకార్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. సౌమ్యని విచారిస్తున్నారు. ఓంకార్ పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version