NTV Telugu Site icon

A Village Without TV: ఆ ఊరిలో ఏ ఇంట్లోనూ టీవీ ఉండదు

Tv

Tv

A Village Without TV: ఈ రోజుల్లో వినోదానికి లోటు లేదు. ఎందుకంటే టీవీలు, మొబైల్స్ వచ్చాయి. మొబైల్‌లో ఇంటర్నెట్ పుణ్యమాని ప్రతీ ఒక్కరూ ఇప్పుడు ఓ చేతిలో మొబైల్, మరో చేతిలో రిమోట్ తో బిజీ అయిపోతూ ఉంటారు. ప్రతీ ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా టీవీ ఉంటుంది. మహిళలంతా సాయంత్రం అయిందంటే సీరియల్స్ కోసం టీవీలకు అతుక్కుపోతుంటారు. యువత అయితే క్రికెట్ వస్తే పక్కన ప్రపంచ యుద్ధం జరిగినా టీవీల ముందు నుంచి కదలరు. అలాంటి ఓ ఊరి ప్రజలు వందల ఏళ్లనుంచి టీవీనే చూడరంటే నమ్ముతారా.. ఇప్పుడు ఓ ఊరు వైరల్ అవుతోంది. కాకపోతే ఆ ఊరిలో అన్ని సౌకర్యాలు ఉంటాయి.. ఉండనిదల్లా టీవీనే.. ఎందుకో మీకు తెలుసా? అయితే ఈ స్టోరీ పూర్తిగా చదవండి.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, అమేథి జిల్లాలోని గౌరీగంజ్ తహసీల్ పరిధిలోకి వచ్చే అయింతా గ్రామంలో సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో రోడ్డు, విద్యుత్, నీరు ఇలా ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు అన్నీ ఉంటాయి. అంతే కాకుండా ఫ్రిజ్, కూలర్, వాషింగ్ మెషీన్ కూడా దాదాపు అన్ని ఇళ్లలో కనిపిస్తుంటాయి. కానీ కనిపించనిదల్లా టీవీ(టెలివిజన్). ఇక్కడ టీవీ వాడకపోవడం ఆ ఊరి సంప్రదాయం. అనాదిగా వస్తున్న ఆచారాన్ని నేటికీ గ్రామస్తులు నిష్ఠగా పాటిస్తున్నారు. టీవీ లేకపోవడంతో ప్రజలు వినోదం కోసం దుకాణాల వద్ద కూర్చుంటారు. వార్తాపత్రికలు చదువుతారు. వారు ఒకరి వార్తలను ఒకరు పంచుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ మాత్రం చూడరు.

Read Also: Gidugu Rudra Raju: దేశ ఆర్థిక భద్రతకు కాంగ్రెస్ నిరంతర పోరాటం

అయింతా గ్రామంలో పిల్లలు చదివేందుకు రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. దీనితో పాటు, మతపరమైన విద్య కోసం మదర్సా కూడా ఉంది. ఇక్కడ పిల్లలకు ఉర్దూతో పాటు హిందీ భాష కూడా బోధిస్తారు. గ్రామంలో దాదాపు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ నేటికీ ప్రజలు ఇక్కడ టీవీని ఉపయోగించరు. పెళ్లిళ్లలో కూడా టీవీని బహుమతిగా ఇవ్వరు.. తీసుకోరు. ఈ ఊరి వాళ్ళు కూడా విదేశాల్లోనే ఉంటారు. కానీ వాళ్లు టీవీ మాత్రం చూడరు. తమకు టీవీ చూసే సంప్రదాయం లేదని అయింత గ్రామానికి చెందిన రిజ్వాన్ అహ్మద్ చెప్పాడు. గ్రామంలో ఎక్కడా టీవీ ఉండదని, మన మతంలో టీవీ చూడటం నేరంగా పరిగణిస్తామన్నారు. ఈ సంప్రదాయం పూర్వీకుల ఆచారమని.. భవిష్యత్తులో కూడా ఇదే అనుసరించబడుతుందని రిజ్వాన్ తెలిపాడు.

Read Also: Dinesh karthik: అతడి బౌలింగ్ అంటే కోహ్లీ, రోహిత్‌కు చిరాకు: దినేశ్ కార్తీక్

గ్రామపెద్ద మహ్మద్ షమీమ్ మాట్లాడుతూ.. టీవీల్లో చూపించే కార్యక్రమాలు తమ మతానికి విరుద్ధమన్నారు. టీవీలు చూడకపోవడం వల్ల పిల్లలు తప్పు సహవాసాలు చేయరు.. వారికి ఎలాంటి దుష్ప్రభావాలు రావని ఆయన అన్నారు. అందుకే టీవీని ఇక్కడ ఎప్పుడూ ఉంచలేదు. ఏళ్ల తరబడి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే, ఎవరైనా రహస్యంగా మొబైల్‌లో ఏదైనా చూస్తుంటే అది వేరే విషయం, కానీ ఇక్కడ టీవీ చూడటం లేదా ఉంచుకోవడం నిషేధమన్నారు.