Site icon NTV Telugu

Palla Rajeshwar Reddy: తెలంగాణలో బీజేపీకి ఒక అసెంబ్లీ సీటు వచ్చే ఛాన్స్ లేదు..

Palla Rajeshwar Reddy

Palla Rajeshwar Reddy

వరంగల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మేము అవినీతి చేశామని ప్రధాని మోడీ అంటున్నారు కదా.. దర్యాప్తు సంస్థలు అన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా?.. ఏమి చేస్తున్నారు?.. మీరు అని ఆయన ప్రశ్నించారు. వేట కుక్కలా వెంట పడిన మా దగ్గర ఏమి లేదని తేలింది అని పల్లా అన్నారు. ఈ ఏడాది రైతు రుణ మాఫీ చేసేందుకు సీఎం కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉంది అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

Read Also: Kushitha kallapu: బజ్జీల పాపకి గురూజీ బంపర్ ఆఫర్.. ఏకంగా మహేష్ తోనే?

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీకి ఒక్క అసెంబ్లీ సీటు కూడా వచ్చే అవకాశం లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేవలం ఆదాని, అంబానీల కోసం పనిచేస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ కంపెనీలను మోడీ కబ్జా చేస్తున్నారు.. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వరుసగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నాము ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్ పేపర్ లీక్ చేస్తే వరంగల్ పోలీసులు జైల్ లో పెట్టారు.. గుజరాత్ లో ఒక్క పరీక్ష కూడా పెట్టలేని పరిస్థితిలో బీజేపీ సర్కార్ ఉంది అని అన్నాడు. మోడీ సర్కార్ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ అప్పులు చేసింది అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

Read Also: Shubman Gill: నేను వేసుకున్న షర్ట్ ను నువ్వు వేసుకున్నావ్.. ఏంది బ్రో..!

Exit mobile version