2027 Pongal Fight : వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే కాంపిటీషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్‌కు భారీ కాంపిటీషన్ నెలకొంటోంది. 2026 పండుగకు ఫైట్ ఎలా ఉందో చూశాం. సీనియర్ హీరో చిరంజీవి నుండి జూనియర్ హీరో నవీన్ పోలిశెట్టి వరకు సందడి చేశారు. ఇక నెక్ట్స్ ఇయర్ పొంగల్‌కు రిలీజ్ ప్లాన్స్ అప్పుడే మొదలయ్యాయి. ఫస్ట్ స్లాట్ బుక్ చేసేసుకుంటున్నారు.
యంగ్ బాయ్ తేజ సజ్జా మిరాయ్‌తో మరో సక్సెస్ కొట్టిన తేజ సజ్జా నెక్ట్స్ జాంబి రెడ్డి2ని లైన్లో పెట్టాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వ బాధ్యతలు రానా నాయుడు ఫేమ్ సుపర్ణ్ వర్మ చేతిలో పెట్టినట్లు టాక్. 2027 పొంగల్‌ను టార్గెట్ చేస్తున్నాడు తేజ. తాజాగా పండుగ కాంపిటీషన్‌లోకి వచ్చేశాడు శర్వానంద్. శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నాడు. జార్జ్ కృష్ణ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సెంటిమెంట్‌తో 2027 ఫెస్టివల్ రేసులోకి దిగుతోంది. అలాగే వరుణ్ తేజ్ హీరోగా కమిటీ కుర్రాళ్లు ఫేం యదువంశీ దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘బరి’తో 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు.ఈ సినిమాను సిస్టర్ నిహారిక కొణిదెల నిర్మిస్తోంది. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టడం అనిల్ రావిపూడికి అలవాటైంది. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం.. ఈ ఏడాది మన శంకర్ వరప్రసాద్ గారుతో బ్యాక్ టు బ్యాక్ పొంగల్ బ్లాక్ బస్టర్స్ చూసిన అనిల్.. నెక్ట్స్ వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. ఇది కూడా 2027 పండుగకే రాబోతుంది. అలాగే చిరంజీవి- బాబి ఫిల్మ్ పొంగల్‌కు వచ్చే ఛాన్స్ ఉందని టాక్ రాగా.. సినిమా ఇంకా పట్టాలెక్కపోవడంతో ఫెస్టివల్‌కు రాకపోవచ్చని ఓ అంచనాకు రావొచ్చు.
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
మనకే సంక్రాంతి సీజన్ ఫుల్ ఫ్యాక్డ్ అయ్యిందంటే.. పొరుగు నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు స్పేస్ ఇవ్వండని అంటున్నారు. తలైవా 173ని ఉళగనాయగన్ కమల్ హాసన్ భారీ లెవల్లో నిర్మిస్తున్నారు. శిబి చక్రవర్తి దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 2027 సంక్రాంతికే రాబోతుందని అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. తలైవా వస్తే మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు డిస్కర్షన్. 2027 సంక్రాంతి వచ్చే సరికి బరిలో ఎన్ని నిలుస్తాయో..? ఎన్ని తప్పుకుంటాయో..? ఇంకా ఎన్ని జాయిన్ అవుతాయో లెట్స్ సీ.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!