మరికొన్ని గంటల్లో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కాబోతుంది. దీంతో నూతన సచివాలయానికి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 600 మంది బెటాలియన్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. రెండు షిఫ్ట్ లో 600 మంది సెక్యూరిటీ సిబ్బంది పనిచేయనున్నారు. రేపటి కార్యక్రమం కోసం భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : Monthly Progress Report: ఏప్రిల్ మాసం ‘విరూపాక్ష’దే!
రేపటి కార్యక్రమాల కోసం 500 మంది పోలీస్ సిబ్బందితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అదనపు పోలీస్ కమిషనర్ నేతృత్వంలో బందోబస్తు.. ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపటి కార్యక్రమాల కోసం ముందస్తుగా అధికారులు సెక్యూరిటీ బ్రీఫింగ్ చేస్తున్నారు. రేపు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పటిష్టమైన బందోబస్తు కొనసాగనుందని వెల్లడించారు. రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.
Also Read : Hyderabad : రేపు హైదరాబాద్ లో పార్కుల మూసివేత
అలాగే నగరంలో సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినట్లు పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. పలు మార్గాల ద్వారా వెళ్లేలా రూట్ మ్యాప్ లను హైదరాదాద్ పోలీసులు విడుదల చేశారు. వీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వరకు ఇరువైపుల అప్పటి పరస్థితులను బట్టి ట్రాఫిక్ ను నిలిపివేస్తారు. ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెన్ రోడ్డు, లుంబినీ పార్కులు మూసివేయనున్నట్లు అదనపు సీపీ వెల్లడించారు. ఆహ్వానితుల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించామని, సచివాలయానికి వచ్చే ఆహ్వానితులు తమ పాస్ లను కార్ డోర్లకు అతికించుకోవాలని సూచించారు.