NTV Telugu Site icon

Hyderabad: జంట హత్య కేసులో ట్విస్ట్.. హత్యకు కారణం అదే..

Upmurder

Upmurder

నార్సింగి పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో హత్యకు గురైన జంట కేసులో ట్విస్ట్ నెలకొంది. నార్సింగి పోలీస్ స్టేషన్ డబుల్ మర్డర్ కేసులో పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది. అక్రమ సంబంధం కారణంగా దారుణం హత్య చేసినట్లు తేలింది. యువకుడు అంకిత్ సాకేత్ యువతి బిందూ గత కొద్దికాలంగా పరిచయం ఏర్పడింది. ఇరువురి మధ్య కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. అంకిత్ సాకేత్ ఈ నెల 11న బిందును ఎల్బీనగర్ నుంచి నానక్ రామ్ గూడకు పిలిపించాడు. బిందును తన స్నేహితుడి రూమ్‌లో ఉంచాడు.

READ MORE: Congress New Office: నేడు డిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం..

ఆ మరుసటి రోజు ఇద్దరు కలిసి పుప్పాలగూడ గుట్టల వద్దకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. అక్కడ ఏకాంతంగా గడిపారు. అంకిత్ సాకేత్ కు తెలియకుండా మరో యువకుడితో బిందు ప్రేమాయణం సాగించింది. ఇద్దరు అక్కడ ఉండగా రెడ్ హ్యండెడ్‌గా చూసిన మరో ప్రియుడు.. జీర్ణించుకోలేక పోయాడు. ఒక్కసారిగా బిందుపై దాడి చేశాడు. బండరాళ్లతో బాది హత్య చేశాడు. సాకేత్ అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. పారిపోతున్న సాకేత్ పై సైతం దాడికి పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ఇద్దరి ముఖాలపై బండరాయితో దాడి చేసి పరారయ్యాడు. హంతకుడి కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

READ MORE: Rishabh Pant: రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైన రిషబ్ పంత్

Show comments