Site icon NTV Telugu

Release clash : ఆగస్టు 15 హౌస్ ఫుల్ …

Aug 15

Aug 15

కొత్త సినిమాల విడుదలకు జులై మాసాన్ని అన్ సీజన్ గా పరిగణిస్తారు సినీ వర్గాలు. స్కూల్స్, కాలేజీలు స్టార్ట్ చేసే టైమ్, మరోపక్క వర్షాలు, రైతులు పంటలు సాగుచేసే రోజలు, సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు అంత త్వరగా కదిలరు. ఈ కారణంగానే పెద్ద సినిమాలు ఏవి జులైలో విడుదలకు అంత మొగ్గు చూపవు. ఇక చిన్న సినిమాల సంగతి సరే సరి.

Real Boom in Pithapuram: డిప్యూటీ సీఎం పవన్‌ ప్రకటన.. రియల్ భూమ్ @ పిఠాపురం..!

తర్వాత వచ్చే ఆగస్టు నెల సినిమాల విడుదలకు అనువైన రోజులు. ఆగస్టు 15న స్వాతంత్రదినోత్సవం, పబ్లిక్ హాలిడే కావడంతో పెద్ద సినిమాలు అన్ని ఆరోజు రావడానికే ముందుగా రిలీజ్ డేట్ లు లాక్ చేసి ఉంచుతాయి. అలా ఈసారి ఆగస్టు డేట్ ను ముందుగానే లాక్ చేసింది పాన్ ఇండియా సినిమా పుష్ప – 2. కానీ ఇప్పటికి షూటింగ్ ఇంకా చాల వరకు పెండింగ్ ఉండడంతో ఆగస్టు విడుదల వాయిదా వేస్తూ అధికారక ప్రకటన చేసింది పుష్పను నిర్మిస్తున్న మైత్రీ మూవీస్.

Rangareddy: రంగారెడ్డి టీచర్ల బదిలీల్లో గందరగోళం.. రిటైర్డ్ అయిన టీచర్ కి పదోన్నతి..

కాగా ఆ డేట్ కోసం ఇప్పుడు రెండు చిన్న చిత్రాలు, రెండు పెద్ద చిత్రాలు కర్చీఫ్ వేసేందుకు రెడీ అయ్యాయి. ముందుగా రామ్ పోతినేని, పూరీల డబల్ ఇస్మార్ట్ అందరి కంటే ముందుగా ఆగస్టు 15న విడుదల అని తెలియచేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక మరో పెద్ద సినిమా మాస్ మహారాజ రవితేజ, పీపుల్స్ మీడియాల MR. బచ్చన్ ఆగస్టు 15న విడుదలకు సన్నాహాలు చేస్తోంది. రిలీజ్ డేట్ పై నేడో రేపో అధికారక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రంతో పాటు మరో రెండు చిన్న చిత్రాలు లైన్ లో వేచి ఉన్నాయి. వాటిలో జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ప్రధాన పాత్రలో గీత ఆర్ట్స్2 నిర్మిస్తున్న ‘ఆయ్’. మరొక చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో నివేద థామస్ ప్రధాన పాత్రలో వస్తున్న ’35 చిన్నసినిమాకాదు’. ప్రస్తుతం ఈ నాలుగు చిత్రాలు రేసులో ఉన్నాయి.

మరోవైపు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు తెరపై దిగేందుకు ఎదురుచూస్తున్నాయి. ఈ రేసులో గెలిచేది ఎవరో, ప్రేక్షకులు ఆదరించేది ఏ చిత్రాన్నో, కలెక్షన్ల కుమ్మరించేది ఏ చిత్రానికో చూడాలి…

Exit mobile version