NTV Telugu Site icon

Tomato: టమాటాలు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..!

Tomato

Tomato

మనం ఎక్కువగా కూరల్లో వాడే కూరగాయ టమాటా. ఇది లేనిది ఏ కూర వండరు. అంతేకాకుండా దీన్ని ఇతర కూరగాయల వంటల్లో వేయడం వల్ల మంచి రుచిని ఇస్తుంది. అందుకే టమాటాను ప్రతి ఒక్క కూరల్లోనూ ఉపయోగిస్తారు. ఇక ఆరోగ్యం విషయానికొస్తే.. దీనిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, రాగి, ఫైబర్స్, ప్రోటీన్, లైకోపీన్ వంటి సేంద్రీయ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. టమాటాలు తినడం వల్ల ఎన్నో రోగాల ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు. టమాటాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also: Cricket Betting: క్రికెట్‌ బెట్టింగ్ రాకెట్‌ బట్టబయలు.. కారులోనే మొబైల్ ఫోన్లు పెట్టి..

గుండె ఆరోగ్యం
టమాటాల్లో ఉండే లైకోపీన్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని వైద్యులు అంటున్నారు. టమాటాల్లో గుండెను కాపాడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. టమాటాలను మన డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.

జీర్ణ సమస్యలు
టమాటాలు తినడం వల్ల జీర్ణ సమస్యల బారీ నుంచి కాపాడుకోవచ్చు. వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన.. మలబద్ధకం, విరేచనాలను నివారించడంలో ఇవి ఎంతో మేలు చేస్తాయి.

కంటి ఆరోగ్యం
లుటిన్, లైకోపీన్ వంటి ముఖ్యమైన కెరోటినాయిడ్లు టమాటాల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే టమాటాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

Read Also: Tatikonda Rajaiah: సొమ్మొకడిది.. సోకొకడిది.. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాట్ కామెంట్స్

చర్మ, జుట్టు ఆరోగ్యం
విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే టమాటాలను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి చర్మ, జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తాయి.

క్యాన్సర్ నివారణ
మాలిక్యులర్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఎక్కువ మోతాదులో బీటా కెరోటిన్ తీసుకోవడంవల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ లో కణితి అభివృద్ధిని నివారించడానికి సహాయపడుతుంది.

అధిక రక్తపోటు
టమాటాతో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండే టమాటాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు పెరిగే అవకాశం ఉండదు.

డయాబెటీస్
ఒక కప్పు చిన్న టమోటాలో సుమారు 2 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా టమాటాలు తినొచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు.

నోట్: ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాం. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవల్సిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు.కామ్ బాధ్యత వహించదు.