NTV Telugu Site icon

OTT Movies: వారంలో ఓటీటీల్లోకి రాబోతున్న 22 సినిమాలు.. ఎక్కడ చూడాలంటే..

Ott

Ott

ఓటీటీ ప్రేమికులకు కొత్త వారం ప్రారంభమైతే చాలు, పెద్ద పండుగ ప్రారంభమైనంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త వారం వచ్చిందంటే చాలు.. అన్ని రకాల కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇప్పుడు ఓటీటీల్లోకి అందుబాటులో ఉంటాయి. ఎప్పటిలాగే మరో వారం వచ్చింది. అయితే ఇది ఎన్నికల సమయం కావడంతో గత కొన్ని వారాలుగా థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు.

Also Read: Chetan Chandra: ఘోరంగా నటుడిపై దాడి.. రక్తం దెబ్బలతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి..

విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా ఈ వారం విడుదల కానుండగా.. మే 31కి వాయిదా పడింది. దాంతో ‘రాజు యాదవ్’ అంటూ గెటప్ శీను లీడ్ రోల్ చేసిన సినిమా మాత్రమే విడుదల కానుంది. ఇదిలా ఉంటే “అపరిచితుడు” సినిమా మళ్లీ విడుదలవుతోంది. అంతే కాకుండా సినిమాల్లో ఎంజాయ్ చేసే బ్లాక్ బస్టర్స్ లేవు. ఈ విధంగా, ఓటీటీలో 20కి పైగా వెబ్ సిరీస్ సినిమాలు విడుదల కానున్నాయి. ఇకపోతే ఏ ఓటీటీలో ఏ సినిమాలు ప్రసారం అవుతున్నాయో ఓసారి చూద్దాం.

జియో సినిమాలో: డిమోన్ స్లేయర్ (జపనీస్ సిరీస్) – మే 13 , C.H.U.E.C.O సీజన్ 2 (స్పానిష్ సిరీస్) – మే 14 , జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా) – మే 17 , బుక్ మై షో గాడ్జిల్లా X కాంగ్: ద న్యూ ఎంపైర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 13 (ఆల్రెడీ స్ట్రీమింగ్)

నెట్‌ఫ్లిక్స్ లో: ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్ & స్కాండల్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 15 , బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మే 15, బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – మే 16, మేడమ్ వెబ్ (ఇంగ్లీష్ సినిమా) – మే 16, పవర్ (ఇంగ్లీష్ మూవీ) – మే 17, ద 8 షో (కొరియన్ సిరీస్) – మే 17, థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) – మే 17

అమెజాన్ ప్రైమ్ లో : ఔటర్ రేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మే 16, 99 (ఇంగ్లీష్ సిరీస్) – మే 17

హాట్‌స్టార్ లో: క్రాష్ (కొరియన్ సిరీస్) – మే 13, చోరుడు (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 14, అంకుల్ సంషిక్ (కొరియన్ సిరీస్) – మే 15, బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) – మే 17, జీ5 బస్తర్ : ద నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) – మే 17 , తళమై సెయలగమ్ (తమిళ సిరీస్) – మే 17

సోనీ లివ్ లో లంపన్ (మరాఠీ సిరీస్) – మే 16

ఆపిల్ ప్లస్ టీవీలో ద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 17

ఎమ్ఎక్స్ ప్లేయర్ లో ఎల్లా (హిందీ సినిమా) – మే 17 లు ఓటీటీల్లోకి రాబోతున్నాయి.