Site icon NTV Telugu

World’s Billionaires List: ఈ 10 దేశాలలో భారత్ కంటే ఎక్కువ ధనవంతులు.. ఏయే దేశాలంటే?

World's Billionaires List

World's Billionaires List

ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులకు కొదవ లేదు. వరల్డ్ లో పలు దేశాల్లో అత్యధిక రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారు. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2024 ప్రకారం ఈ 10 దేశాలలో భారత్ కంటే ఎక్కువ ధనవంతులు ఉన్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం అమెరికా. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో తొమ్మిది మంది ఈ దేశానికి చెందినవారే. అతి ధనవంతుల జాబితాను పరిశీలిస్తే, అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో $30 మిలియన్ల కంటే ఎక్కువ లేదా రూ.2,65,85,55,000 కంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తుల జనాభా 225,077. ఈ జాబితాలో ఎవరూ కూడా అమెరికాకు దగ్గరగా లేరు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా, రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశమైన చైనా ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. అక్కడ అతి ధనవంతుల జనాభా 98,551.

Also Read:Masood Azhar: ముంబై, పార్లమెంట్, పఠాన్‌కోట్, పుల్వామా , ఇప్పుడు ఢిల్లీ.. పాకిస్తాన్‌లో సురక్షితంగా మసూద్ అజార్..

యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఈ దేశంలో 29,021 మంది ఉన్నారు. వారి నికర విలువ $30 మిలియన్లకు మించి ఉంది. కెనడాలో అలాంటి వారి సంఖ్య 27,928. వాటి తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్ (24,941), యుకె (23,072), జపాన్ (21,710), ఇటలీ (15,952), ఆస్ట్రేలియా (15,347), స్విట్జర్లాండ్ (14,734) ఉన్నాయి. యూరప్ ప్లే గ్రౌండ్ గా పిలువబడే స్విట్జర్లాండ్‌లో ఉత్తరాఖండ్ కంటే తక్కువ జనాభా ఉండగా, దాని వైశాల్యం హర్యానా కంటే చిన్నది.

Also Read:IPL 2026 Trades: ఐపీఎల్ చరిత్రలో 5 అత్యంత ఖరీదైన ట్రేడ్‌లు ఇవే!

ఈ జాబితాలో భారతదేశం 11వ స్థానంలో ఉంది. భారతదేశంలో 13,263 మంది $30 మిలియన్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. జనాభా పరంగా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. భారతదేశం తరువాత స్పెయిన్ (10,149), నెదర్లాండ్స్ (8,390), తైవాన్ (7,640), దక్షిణ కొరియా (7,310), హాంకాంగ్ (5,957), సింగపూర్ (4,783), స్వీడన్ (4,125), న్యూజిలాండ్ (2,587), నార్వే (2,276) ఉన్నాయి.

Exit mobile version