ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా బీటౌన్‌లో ఎదగడమంటే మామూలు విషయం కాదు. కానీ కష్టపడితే అసాధ్యమేమీ కాదని ఫ్రూవ్ చేశాడు కార్తీక్ ఆర్యన్. ప్యార్ కే పంచనామాతో మొదలైన అతడి ప్రయాణం సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతోంది. భూల్ భూలయ్యా2 భారీ సక్సెస్ తర్వాత కార్తీక్‌కు బీటౌన్‌లో క్రేజ్ అమాంతం పెరిగితే భూల్ భూలయ్యా3 వచ్చేసరికి రెమ్యునరేషన్ పెంచేశాడు. మధ్యలో షెహజాదా, చందు చాంపియన్ ఫ్లాపులున్నా కూడా అతడు అడిగినంత ముట్టచెప్పింది టీ సిరీస్. భూల్ భూలయ్యా2కి రూ. 15 కోట్లు ఛార్జ్ చేసిన కార్తీక్.. థర్డ్ ఇన్ స్టాల్ మెంట్ వచ్చేసరికి సుమారు రూ. 45 కోట్లు చార్జ్ చేశాడట. అంటే మూడు రెట్లు హైక్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు.
Also Read : Mysaa First Glimpse : రష్మిక మందన్న ‘మైసా గ్లిమ్స్’ రిలీజ్.. రౌడీకి పోటి ఇస్తుందిగా
భూల్ భూలయ్యా3 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరోసారి రెమ్యునరేషన్ పెంచేశాడు కార్తీక్ ఆర్యన్. ప్రజెంట్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్‌లో తు మేరీ మై తేరాలో చేస్తున్నాడు హీరో. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 50 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నాడట. ఈ సినిమా బడ్జెట్టే రూ. 150 కోట్లు కాగా, అందులో వన్ థర్డ్ కార్తీక్ రెమ్యునరేషన్‌గా తీసుకోవడం బీటౌన్‌లో హాట్ టాపిక్ అయ్యింది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది తు మేరీ మైతేరా.. మై తేరా తు మేరీ. అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సీబీఎఫ్సీ ఓ త్రీ అబ్జెక్షన్స్ చెప్పిందట. ఫస్టాఫ్‌లో కొన్ని రొమాంటిక్ సీన్స్ తగ్గించమని , అలాగే కొన్ని అసభ్యకరమైన పదాలను, డైలాగ్స్ లో మ్యూట్ చేయడం లేదా తొలగించాలని సూచించిKartik Aaryanదట. సెకండ్ పార్ట్‌లో ఓ అభ్యంతరకర సీన్ తీసేయమని చెప్పిందట. మార్పులు చేశాక సినిమాకు సెన్సార్స్ అయినట్లు తెలుస్తోంది.
