NTV Telugu Site icon

Passports: అత్యంత బలహీనమైన పాస్‌పోర్టు పాకిస్థాన్‌దే.. మరి భారత్‌ సంగతేంటి?

Passports

Passports

Passports: 2023లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశంగా జపాన్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఈ పాస్‌పోర్టుతో వీసా లేకుండానే 193 ప్రపంచ దేశాల్లో ప్రయాణించవచ్చు. తాజా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. జపాన్‌ దేశం వరుసగా ఐదో సంవత్సరం అగ్రస్థానంలో ఉంది. ఈ మేరకు హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ అనే సంస్థ 2023లో ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన డేటా ఆధారంగా హెన్లీ సంస్థ 199 దేశాలతో కూడిన జాబితాను ప్రకటించింది.  ర్యాంకింగ్‌లో సింగపూర్, దక్షిణ కొరియా సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. ఈ రెండో స్థానంలో నిలిచిన ఆ రెండు దేశాల ప్రజలు పాస్‌పోర్టుతో 192 దేశాల్లో వీసా-రహిత ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఆ తర్వాత జర్మనీ, స్పెయిన్, ఆపై ఇతర యూరోపియన్ దేశాలు ఉన్నాయి.

జర్మనీ, స్పెయిన్‌ దేశాల పాస్‌పోర్ట్‌లు మూడో స్థానంలో ఉండగా.. ఫిన్లాండ్, లక్సెంబర్గ్‌, ఇటలీ దేశాలు నాలుగో స్థానంలో ఉన్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, స్వీడన్‌ దేశాల పాస్‌పోర్టులు ఐదో స్థానంలో.. ఫ్రాన్స్‌, ఐర్లాండ్, పోర్చుగల్‌, బ్రిటన్‌ దేశాలు ఆరో స్థానానికి పరిమితమయ్యాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లతో వీసా లేకుండా 187 దేశాల్లో పర్యటించవచ్చని హెన్లీ పాస్‌పోర్ట్ నివేదికలో పేర్కొంది. స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ మరియు నార్వే వంటి వాటితో సరిపోలే 186 ప్రదేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో అమెరికా టాప్ 22లో ఉంది. బొలీవియా మాదిరిగానే చైనా 80కి యాక్సెస్‌ని అనుమతిస్తుంది. రష్యా మెరుగైనది, 118 గమ్యస్థానాలకు అవాంతరాలు లేకుండా ప్రవేశాన్ని అందిస్తోంది, అయితే ఆఫ్ఘనిస్తాన్ బలహీనంగా ఉంది, కేవలం 27 మాత్రమే అందుబాటులో ఉంది.

ఏడో స్థానంలో బెల్జియం, చెక్‌ రిపబ్లిక్‌, న్యూజిలాండ్‌, నార్వే, స్విట్జర్లాండ్, అమెరికా పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. వీటితో 186 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. తర్వాత 8వ స్థానంలో ఆస్ట్రేలియా, కెనడా, గ్రీస్‌.. 9వ స్థానంలో పోలాండ్‌, హంగేరీ.. 10వ స్థానంలో లిథువేనియా, స్లొవేకియాలు ఉన్నాయి. 2023 జాబితాలో మొదటి పది స్థానాల్లో యూరప్ దేశాలకు చెందిన పాస్‌పోర్ట్‌లే ఎక్కువగా ఉండటం గమనార్హం.  బొలీవియా, మాదిరిగానే చైనా 66వ స్థానంలో ఉండగా.. ఆ పాస్‌పోర్టుతో 80 దేశాల్లో వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. రష్యా 118 గమ్యస్థానాలకు అవాంతరాలు లేకుండా ప్రవేశాన్ని అందిస్తోంది.

Ebola Virus: ఎబోలా వ్యాప్తికి ముగింపు పలికిన ఉగాండా.. ఇప్పటివరకు 55 మంది బలి

ఇదిలా ఉండగా భారత్ ఈ జాబితాలో 85 వ స్థానంలో నిలిచింది. గతేడాది భారత్ 83వ స్థానంలో ఉండి.. 60 దేశాల్లో ప్రయాణించేందుకు వీలుండగా.. ఈ ఏడాది 59 దేశాలు మాత్రమే వీసా రహితంగా అనుమతిస్తున్నాయి. గతేడాది భారత్‌ పాస్‌పోర్ట్‌ ఉన్నవారి వీసా లేకుండా పర్యటించేందుకు అనుమతించిన సెర్బియా, ఈ ఏడాది ఆ నిబంధనను తొలగించింది. హోన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం 2006లో భారత్‌ 71వ స్థానంలో ఉండగా, 2023 నాటికి 85వ స్థానంలో ఉండటం గమనార్హం.  ఈ జాబితాలో చివరి పది స్థానంలో శ్రీలంక(100), బంగ్లాదేశ్(101). నేపాల్(103), పాకిస్థాన్‌(106), చివరిస్థానంలో అత్యంత బలహీనమైన పాస్‌పోర్టుగా ఆఫ్ఘనిస్థాన్‌ నిలిచింది.