NTV Telugu Site icon

Tamilnadu : వెర్రిపప్పలను చేశావుగా.. కోడికూర వడ్డించి కోట్లు కొట్టేశావా తల్లో

Whatsapp Image 2023 05 05 At 1.15.24 Pm

Whatsapp Image 2023 05 05 At 1.15.24 Pm

Tamilnadu : తమిళనాడులో విచిత్రమైన దోపిడీ జరిగింది. కిలాడీ లేడి తన స్నేహితురాలికి ప్రేమతో కోడికూర వడ్డించి కోట్ల రూపాయలు కొట్టేసింది. కోయంబత్తూరులోని రామనాథపురం కృష్ణ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వర్షిణి అనే యువతి స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రాజేశ్వరి అనే మహిళతో పరిచయం పెంచుకుంది. వేలాది ఎకరాలు కొనేందుకు కొంతమంది సిద్ధంగా ఉన్నారని వర్షిణి రాజేశ్వరికి చెప్పింది. దీంతో వారిని తన వద్దకు తీసుకురమ్మని వర్షిణిని రాజేశ్వరి కోరింది. దీంతో వర్షిణి తన స్నేహితులైన అరుణ్‌కుమార్‌, సురేంద్రన్‌, ప్రవీణ్‌లను కస్టమర్లుగా రాజేశ్వరి ఇంటికి తీసుకుని వచ్చి పరిచయం చేసింది.

Read Also:Fake ice cream: మళ్లీ కల్తీ ఐస్‌ క్రీం కలకలం.. లైట్ తీసుకుంటే ప్రాణానికే ప్రమాదం

ఇంటిలో భోజనం చేస్తూ మాట్లాడుతుండగా సడన్ గా రాజేశ్వరి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన కిలాడీలు ఇంట్లో ఉన్న రెండున్నర కోట్ల నగదు… వంద సవర్ల బంగారం, ఆభరణాలతో పరారయ్యారు. మత్తునుంచి తేరుకోగానే రాజేశ్వరి తన ఇంట్లో దోపిడీ జరిగినట్లు గ్రహించింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో చోరీ విషయంపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వర్షిణి ఆమె స్నేహితులపై కేసు నమోదు చేశారు. అనంతరం వర్షిణి స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తనకు బయట నుండి తెచ్చిన కోడి కూర పెట్టారని రాజేశ్వరి పోలీసులకు తెలిపింది. అది తిన్న వెంటనే కళ్ళు తిరిగిపడినట్లు రాజేశ్వరి పోలీసులకు వివరించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న కీలాడి లేడి వర్షిణి కోసం కోయంబత్తూరు పోలీసులు గాలిస్తున్నారు. వర్షిణి విదేశాలకు పరారీ అయినట్లు ఆమె స్నేహితులు చెబుతున్నారు.

Read Also:S Jaishankar: అది జైశంకర్ అంటే.. పాకిస్తాన్ మంత్రి ముందే ఉగ్రవాదంపై స్ట్రాంగ్ మెసేజ్..