NTV Telugu Site icon

USA: బార్‌లోకి అనుమతి నిరాకరణ.. ఐదుగురిని కాల్చి చంపిన మహిళ

Usa Fire

Usa Fire

USA: యునైటెడ్ స్టేట్స్‌లోని డెన్వర్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికన్ సింగర్ డైర్క్స్ బెంట్లీ అనే బార్‌లోకి తనను అనుమతించకపోవడంతో ఐదుగురిని కాల్చి చంపింది ఓ మహిళ. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితురాలు అక్కడి నుంచి పరారీ కాగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్లు డెన్వర్ పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కాల్పుల ఘటనపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: MS Dhoni: ఎంఎస్ ధోనితో నాకు నిజంగానే విభేదాలు ఉన్నాయి..

వివరాల్లోకి వెళ్తే.. బార్‌లోకి వెళ్లేందుకు ఆ మహిళ.. మరొకరి ఐడీని ఉపయోగిస్తున్నారనే అనుమానంతో బార్ సిబ్బంది తనను వెళ్లకుండా ఆపారు. దీంతో క్యూ లైనలో ఉన్న మహిళ బయటకొచ్చి.. కంట్రీ మ్యూజిక్ క్లబ్ వైపు విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించింది. ఈ ఘటన నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ సమయంలో ఏమీ అర్థం కాలేదని.. భయంతో పరుగులు తీశామంటూ సాక్షులు చెప్పారు. అంతేకాకుండా.. ఈ ఘటనలో తన స్నేహితులను కాకుండా ఇతరులపై కాల్పులు జరిపిందని అంటున్నారు.

Read Also: Chandrababu Arrest: చంద్రబాబును ప్రశ్నించేందుకు రేపు రాజమండ్రికి సీఐడీ బృందం

Show comments