NTV Telugu Site icon

Chandrababu: చంద్రబాబు కాన్వాయ్‌ వెంట మహిళ పరుగులు.. కారు ఆపి ఆయన ఏం చేశారంటే..?

Chandrababu

Chandrababu

Chandrababu: సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్‌ విక్టరీతో కొత్త రికార్డు క్రియేట్‌ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.. రేపు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.. మరోవైపు.. సమావేశాలు.. కేబినెట్‌ మంత్రులపై కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు.. అయితే, కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్తున్న చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వస్తున్నారు.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలుకుతున్నారు.. ఇక, చంద్రబాబును చూసేందుకు వచ్చిన ఓ మహిళ.. ఆయన కాన్వాయ్‌ వెంట పరుగులు పెట్టింది.. ఇది గమనించిన చంద్రబాబు.. కారు ఆపి.. ఆమెతో మాట్లాడారు.. అనారోగ్యంతో ఉన్న ఆమెకు ధైర్యం చెప్పి.. ఆమెకు అవసరమైన సాయం చేయాలంటూ పార్టీల నేతలకు సూచించారు చంద్రబాబు.

Read Also: Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న యూట్యూబర్.. కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు

ఈ రోజు ఏ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి తిరుగు ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారు లోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి.. ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ.. చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చాను అని చెప్పింది. తనను చూసి ఎమోషనల్‌ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు.. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి.. మా కోరిక మేరకు మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది సదరు మహిళ.. ఒక్క సారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా.. చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడడాలని వచ్చాను అని నందిని చెప్పగా.. ముందు ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని.. అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు నాయుడు.