Viral News: భర్తల కోసం కొందరు పిచ్చి భార్యలు ఎంతటి దానికైనా సిద్ధపడతారు. భర్తే సర్వస్వం, భర్తే జీవితం అన్నట్లుగా బ్రతుకుతారు. అది కూడా కొందరేనండీ.. అందరూ కాదు. ఎక్కువగా పూర్వకాలంలో భర్తను ఓ దైవంగా తలిచేవారు భార్యలు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో భార్యే చెప్పినట్లే భర్త వినాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి. కానీ అందరికీ కాదు.. కొందరు మాత్రం భార్య చెప్పుచేతల్లోనే బతుకుతారు. కానీ ఓ భార్య తన భర్త కోసం ఏకంగా 23 కేజీల బరువు తగ్గిపోయింది. ఎక్కడా అని అనుకుంటున్నారా వివరాల్లోకి వెళ్దాం..
Read Also: Hyderabad: యువతి జీవితాన్ని నాశనం చేసిన 2 వేలు.. దారుణం…
రష్యాకు చెందిన యన అనే మహిళ తన భర్త కోసం ఏకంగా 45 కిలోలు ఉన్న ఆవిడ.. 22 కిలోలకు తగ్గిపోయింది. తన భర్త లావుగా ఉండొద్దని.. బరువు తగ్గించుకోమని ఒత్తిడి చేయడంతో తిండి తినడం మానేసి డైటింగ్ చేసింది. అంతకుముందు ఉబ్బిన బుగ్గలు, చక్కటి అందం, రంగుతో ఉండే ఆ మహిళ.. ఇప్పుడు ఆకలితో మాడి చివరకు గుర్తు పట్టలేనంతగా ఓ ఆస్తిపంజరంలా తయారైంది. చూశారా.. ఆ శాడిస్ట్ భర్త మాటలతో తాన ఆరోగ్యాన్నే పన్నంగా పెట్టింది.
Read Also: Vijay Devarakonda: రౌడీ హీరో సరసన బుట్టబొమ్మ.. ముద్దులకు ఈసారి హద్దులే లేవమ్మా..?
సాధారణంగా ఈ మహిళ బరువు 40 నుంచి 50 కిలోలు ఉంటుంది. యన శరీరం పాలిపోయి పొడిగా అయిపోయింది. ఉబ్బిన బుగ్గలపై తన భర్త కామెంట్స్ చేయడంతో డైటింగ్ ప్రారంభించానని ఆ మహిళ చెప్పుకొచ్చింది. మొదటగా బుగ్గలపై వ్యాఖ్యానించాడని, నెమ్మదిగా తన విశ్వాసాన్ని దెబ్బతీశాడని మహిళ స్థానిక మీడియాకు తెలిపింది. అయితే చదువుకొనే రోజుల్లో కూడా బరువు తగ్గాలని తాను అనుకున్నానని చెప్పింది. ఆమె ఆరోగ్యం రోజు రోజుకు దిగజారుతున్నా భర్త మాత్రం యన ఆరోగ్య విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించలేదు. భర్త కోసం యన ఆమె జీవితాన్ని నాశనం చేసుకుంది. వారి ఇష్టాలను వేరే వారి మీద రుద్ది.. ఇలాంటి పైశాచిక ఆనందం పొందుతారు. భర్త అంటే గౌరవం ఉండాలీ కానీ.. మరీ ఇంతలా ఉండొద్దంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.