NTV Telugu Site icon

French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వడం లేదని భర్తపై భార్య ఫిర్యాదు.. గృహ హింస కేసు నమోదు

Wife Husbend

Wife Husbend

కర్ణాటకలో ఓ వినూత్న ఘటన చోటుచేసుకుంది. తనను భర్త ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తిననీయడం లేదన్న కారణంతోనే భార్య భర్తపై స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో ఏం చేయాలో తోచక భర్త కోర్టుకు వెళ్లాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం అవాక్కైంది. వివరాల్లోకి వెళితే…

READ MORE: Illegal affair: భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని పిలిపించుకున్న భార్య.. తర్వాత ఏమైందంటే..?

కర్ణాటకకు చెందిన దంపతులకు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. ఆరేళ్ల పాటు అమెరికాలో ఉన్న ఈ జంట.. గతేడాది భారత్‌కు వచ్చారు. ఇటీవలే ఓ బిడ్డకు భార్య జన్మనివ్వడంతో ఆరోగ్యం దృష్యా బంగాళాదుంపలతో చేసిన ఫ్రెంచ్ ప్రైస్ వంటివి తినొద్దని మంచి ఆహారం తీసుకోవాలని సదరు భర్త సూచించారు. అయితే, ఇది భార్యకు నచ్చలేదు. తనను వేధిస్తున్నాడని, మాంసాహారానికి దూరంగా ఉండమంటాడని, ఏం తినాలో వద్దో ఆయనే చెబుతున్నాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో బాధితుడు, అతడి తల్లిదండ్రులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 498ఏ కింద గృహ హింస కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో బాధితుడు హైకోర్టును ఆశ్రయించి.. తనపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరాడు. అతడి పిటిషన్‌పై జస్టిస్ నాగప్రసన్న విచారణ చేపట్టారు. ఆమె ఆరోపణలు
సహేతుకంగా లేకపోవడంతో బాధితుడికి ఊరట కల్పించారు.

READ MORE: Reliance Jio: జియో పేరుతో మోసాలు.. తస్మాత్‌ జాగ్రత్త!

కాన్పు అనంతరం పౌష్టికాహారం, పండ్లు, పాలు తీసుకోమని చెబితే కేసు పెట్టిందని భర్త లబోదిబోమన్నాడు. భార్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని తినొద్దని వారిస్తే ఎదురు కేసు పెట్టడం సరికాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అన్ని చోట్లా అతనిపై నమోదైన కేసులపై స్టే విధిస్తున్నట్లు న్యాయమూర్తి ఆదేశించారు. శుక్రవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు రాగా.. భార్య కేసు పెట్టిన కారణం తెలిసి అవాక్కయ్యారు. ‘భర్తకు వ్యతిరేకంగా ఏదైనా విచారణను అనుమతించడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడం.. సంబంధిత సమయంలో ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి అనుమతి ఇవ్వలేదన్న భార్య ఆరోపణల సమంజం కాదు… అందువల్ల, భర్తపై అన్ని విచారణలను తాత్కాలికంగా నిలిపివేయాలి’ అని ఆదేశించారు. అంతేకాదు, ఉద్యోగ పనిమీద అతడు అమెరికా వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది.