Site icon NTV Telugu

AP Weather: ఏపీలో జరిగే పోలింగ్ పై గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ..

Ap Polling

Ap Polling

ఏపీలో రేపు జరగబోయే పోలింగ్ పై భారీ వర్ష సూచన ఉంటుందని ఆందోళన చెందుతున్న అధికారులకు, ఓటర్లకు విశాఖ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పోలింగ్ నిర్వహణకు వరుణుడి ముప్పు తక్కువే అని సూచించింది. రేపు రాష్ట్రంలో వర్ష ప్రభావం పెద్దగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్ష సూచన ఉంటుందని.. భారీ వర్ష సూచన లేదని పేర్కొన్నారు.

Read Also: Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్!

ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఈస్ట్ గోదావరి, పార్వతిపురం మన్యం, శ్రీకాకుళంతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.. ఒకవేళ వర్షాలు పడిన 20-30 నిమిషాలు మాత్రమే ఉంటుందని నిరంతర వర్ష సూచన లేదన్నారు. మరోవైపు.. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలలో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రేపు ఏపీలో కంటే తెలంగాణలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Read Also: Sreemukhi: శ్రీముఖి పెళ్లిపై జబర్దస్త్ కమెడియన్‌ కామెంట్స్.. ఈ ఏడాదే అంటూ?

Exit mobile version