NTV Telugu Site icon

Viral Video : కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తాగుతున్నారా? ఇది చూస్తే జన్మలో తాగరు..

Drinks

Drinks

వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం చాలా మంది సోడా, జ్యూస్ లతో పాటుగా కూల్ డ్రింక్స్ ను కూడా ఎక్కువగా తీసుకుంటారు.. అయితే ఈ రోజుల్లో తినే తిండి నుంచి తాగే నీళ్లవరకు కలుషితం ఏమో కానీ కల్తీ అవుతుంది.. ఎప్పటికప్పుడు అధికారులు కేటుగాళ్ల ఆగడాలను కట్టడి చేస్తున్న కూడా కల్తీ జరగకుండా మానలేదు.. తాజాగా కూల్ డ్రింక్స్ ను కూడా దుర్మార్గులు వదల్లేదు.. పేరుకేమో బ్రాండ్ లోపల ఉన్నదంతా కల్తీ సరుకే ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

వేసవిలో కూల్ డ్రింక్స్ కు మంచి డిమాండ్ ఉంది.. అదే మంచి సమయం అని భావించి కల్తీగాళ్ళు రెచ్చిపోతున్నారు.. పలు రకాల బ్రాండ్ ల పేరుతో కూల్ డ్రింక్స్ ను తయారు చేస్తున్నారు..పట్టణాలు, పల్లెల్లో పలు కిరాణం దుకాణాలను టార్గెట్ చేసుకొని వాటి ద్వారా నకిలీ కూల్ డ్రింక్స్ దందాను కొనసాగిస్తుంటారు. ఇలాంటి దందాపై అధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు.. కల్తీకి కళ్లెం వేస్తున్నారు..

తాజాగా నకిలీ కూల్ డ్రింక్ కు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియోను 29వ తేదీ ఎక్స్ లో షేర్ చేయగా.. ఒక మిలియన్ మంది నెటిజన్లు వీడియోను వీక్షించారు.. దాన్ని చూసిన వారంతా కూడా షాక్ అవుతున్నారు.. కూల్ డ్రింక్స్ తాగాలంటే భయపడుతున్నారు.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి కూల్ డ్రింక్స్ ను కలిపి బాటిల్స్ లో నింపుతున్నారు.. సో కూల్ డ్రింక్స్ తాగేముందు చూసుకొని తాగడం మంచిది.. బీ కేర్ ఫుల్ మిత్రమా..