Silk Smitha : వెండితెర పై సిల్క్ స్మిత అన్ టోల్డ్ స్టోరీ.. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిల్క్ స్మిత..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గ్లామర్ బ్యూటీ గా సిల్క్ స్మిత వెండితెర పై ఓ వెలుగు వెలిగింది.సిల్క్ స్మిత పేరు వింటేనే అప్పట్లో ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఊగిపోయేవారు.. అంతలా సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది సిల్క్ స్మిత..తన అందంతో అప్పట్లో యూత్ ని ఉర్రుతలూగించిన ఈ అందాల తార సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయింది .స్టార్ హీరోలకి మించిన రెమ్యూనరేషన్ తీసుకొని స్టార్ స్టేటస్ లైఫ్ ని ఎంజాయ్ చేసిన సిల్క్ స్మిత వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో చేదు సంఘటనలు ఎదుర్కొన్న ఆమె 1996 సెప్టెంబర్ 23 న ఆత్మహత్య చేసుకున్నారు..
ఈమె సూసైడ్ అప్పట్లో ఒక సంచలనమే అని చెప్పాలి… వెండితెరపై బోల్డ్ పాత్ర లో నటించింది కానీ తెర వెనక మాత్రం సిల్క్ స్మిత చాలా మంచిది అంటూ అప్పట్లో ఎంతో మంది చెప్పుకొచ్చారు…సిల్క్ స్మిత జీవితం ఆధారంగా విద్యాబాలన్ మెయిన్ లీడ్ లో బాలీవుడ్‌లో ‘డర్టీ పిక్చర్’ మూవీ తెరకెక్కింది.. అయితే తాజాగా సిల్క్ స్మిత జీవితం పై మరో బయోపిక్ తెరకెక్కబోతుంది. నేడు డిసెంబర్ 2 ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమె బయోపిక్ ని అనౌన్స్ చేశారు. ఇండియన్ ఆస్ట్రేలియా నటి చంద్రిక రవి ఈ సినిమా లో సిల్క్ స్మిత పాత్రలో కనిపించబోతుంది. నేడు ఆమె ఫస్ట్ లుక్ మేకర్స్ రిలీజ్ చేశారు . ‘సిల్క్ స్మిత అన్ టోల్డ్ స్టోరీ’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో చంద్రిక సిల్క్ స్మితలా కనిపించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశ లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Also Read
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!