ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి నేరుగా రైలులో శుక్రవారం ఉదయం కీవ్ చేరుకున్నారు. కీవ్‌కు చేరుకున్న ఆయనకు భారతీయ కమ్యూనిటీ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనితో కలిసి నేషనల్ మ్యూజియంకు ప్రధాని మోడీ చేరుకున్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో మరణించిన పిల్లలకు, నైనికులకు ఇద్దరు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్శనకు సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు వెలువడ్డాయి. ఇందులో ఇద్దరూ భావోద్వేగానికి లోనవడాన్ని చూడవచ్చు. ఉక్రెయిన్ అధ్యక్షుడి అధికారిక నివాసమైన మారిన్స్కీ ప్యాలెస్‌లో ప్రధాని మోడీ, అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ కానున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు మారిన్స్కీ ప్యాలెస్‌ను పూర్తిగా అలంకరించారు. కీవ్ పర్యటనకు మోడీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా వచ్చారు.
READ MORE: Suicide: ఫేస్‌బుక్ లైవ్లో కోర్టు భవనం నుంచి దూకి మహిళా న్యాయవాది సూసైడ్..
రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన దోహదపడుతుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ భావిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్న తరుణంలో ప్రధాని మోడీ పర్యటనపై ఓ మీడియా సంస్థతో డిజారిక్ మాట్లాడారు.
READ MORE:Pawan Kalyan: ప్రభుత్వ సభలో OG నినాదాలు.. పవన్ షాకింగ్ కామెంట్స్
డుజారిక్ మాట్లాడుతూ.. ‘చాలా మంది దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు ప్రాంతాన్ని(కీవ్) సందర్శించడం చూశాం. ఈ సందర్శనలు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సంఘర్షణను పరిష్కరించడానికి దోహదపడతాయని ఆశిస్తున్నాం. మోడీ పర్యటన యుద్ధానికి ముగింపు పలికేందుకు దోహద పడుతుందని భావిస్తున్నాం. ” అని ఆయన పేర్కొన్నారు. కాగా.. యూఎన్జీఏ మూడు తీర్మానాలలో రష్యా దురాక్రమణను ఆపాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలపై దాడులను ఆపాలని మరో తీర్మానం డిమాండ్ చేసింది. ఈ ప్రతిపాదనలపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.