Indian Police Force : టాప్ ట్రెండింగ్ లో నిలిచిన ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి మరియు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలలో నటించిన ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ బాగా పాపులర్ అవుతోంది.ఈ సిరీస్ కు భారీగా వ్యూస్ వస్తున్నాయి.అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 19వ తేదీన ఇండియన్ పోలీస్ ఫోర్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు ఉర్దూ సహా మరిన్ని భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్‍కు పాజిటివ్ టాక్ వస్తుండటంతో భారీగా వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఈ సిరీస్ భారత్‍తో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈ మరియు సింగపూర్ సహా మరిన్ని దేశాల్లో ప్రస్తుతం టాప్-10లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ తాజాగా వెల్లడించింది. భారత్‍లో ప్రస్తుతం టాప్‍లో ఈ వెబ్ సిరీస్ ట్రెండ్ అవుతోంది.ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్‍పై సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు పాజిటివ్‍గా స్పందిస్తున్నారు.
ఇంటెన్స్‌గా ఉన్న స్టోరీ, ఉత్కంఠగా ఉన్న డ్రామా సహా సిద్ధార్థ్ మల్హోత్రా మరియు శిల్పా శెట్టి యాక్టింగ్‍ను ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఈ సిరీస్‍కు రోహిత్ శెట్టి మరియు సుశ్వాంత్ ప్రకాశ్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‍ను రోహిత్ శెట్టి క్రియేట్ చేసిన తీరుపై కూడా ప్రశంసలు వస్తున్నాయి.ఈ సిరీస్‍లో సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టితో పాటు వివేక్ ఒబెరాయ్, మయాంక్ టాండన్, నితిన్ ధీర్, ఇషా తల్వార్, శ్వేత తివారీ, శరద కేల్కర్, వైదేహి పరశురామి మరియు ముకేశ్ రిషి తదితరులు కీలకపాత్రలు పోషించారు. లిజో జార్జ్ – డీజే చీతాస్ ఈ సిరీస్ కు సంగీతం అందించారు.ఇండియన్ పోలీస్ ఫోర్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ కథ ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల చుట్టూ తిరుగుతుంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగే ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ కు మరిన్ని సీజన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!