NTV Telugu Site icon

Vikram Misri: విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పదవీకాలాన్ని పొడిగించిన కేంద్రం

Vikram Misri

Vikram Misri

Vikram Misri: విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పదవీకాలాన్ని జూలై 14, 2026 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి విక్రమ్ మిస్రీ జూలై 15న విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. విక్రమ్ మిస్రీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది.

Read Also: Sahiba : విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ “సాహిబా” ప్రోమో రిలీజ్

మిస్రీ 1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, కేబినెట్ నియామకాల కమిటీ మిస్రీ పదవీకాలాన్ని నవంబర్ 30 నుండి జులై 14, 2026 వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు పొడిగించింది. FR 56 (D) నిబంధనల ప్రకారం ఈ పదవి కాలం పెంపు ఆమోదించబడింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పదవీ విరమణ తేదీకి మించి కూడా విదేశాంగ కార్యదర్శి సేవలను పొడిగించేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయని అధికారులు తెలిపారు.

Read Also: Deputy CM Pawan Kalyan: జనసేనలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు.. డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

Show comments