NTV Telugu Site icon

LEO : లియో మూవీ నుంచి నా రెడీ సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది..

Whatsapp Image 2023 10 13 At 8.48.51 Pm

Whatsapp Image 2023 10 13 At 8.48.51 Pm

కోలీవుడ్ స్టార్‌ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లియో’… కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. లియో సినిమా కోసం దళపతి విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇదిలా ఉంటే విజయ్ అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ న్యూస్ వచ్చింది.ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ నా రెడీ సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.తాజాగా ఈ పాటను తెలుగుతో పాటు కన్నడ, మలయాళం మరియు హిందీ వెర్షన్‌లో నేడు సాయంత్రం మేకర్స్ విడుదల చేశారు. విష్ణు ఎడవన్ రాసిన ఈ ట్రాక్‌ను తమిళంలో దళపతి విజయ్‌ మరియు అనిరుధ్‌ రవిచందర్ కలిసి పాడగా.. తెలుగులో ఈ పాటను రేవంత్ చేత పాడించారు. రఘురామ్ సాహిత్యం అందించాడు.

ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్‌, యాక్షన్‌ కింగ్ అర్జున్‌, ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పక్కా యాక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న లియో అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.ఇప్పటికే ఈ చిత్రం నుండి వరుసగా మూడు పాటలు విడుదల అయ్యాయి.. మూడు పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.అదిరిపోయే ట్యూన్స్ తో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మరోసారి మ్యాజిక్ చేసాడు..అలాగే రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదల అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ బట్టి సినిమా పై ఏ విధంగా అంచనాలు ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు..మాస్టర్ వంటి సూపర్ హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో లియో సినిమా రావడం తో అభిమానులు సినిమా చూసేందుకు ఎంతగానో ఎక్సయిట్ అవుతున్నారు.