ఖైదీలకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. బెయిల్ మంజూరీ అయిన వెంటనే విడుదలయ్యేలా ఫాస్టర్ విధానం అమలుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఖైదీల విడుదల చేసేలా సిజె ఐ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కోర్టులు బెయిల్ మంజూరీ చేసినా సాంకేతిక కారణాలతో ఖైదీల విడుదలలో జరుగుతున్న జాప్యంపై సుమోటో గా కేసు విచారణను చేపట్టిన సుప్రీం ధర్మాసనం… ఖైదీల విడుదలలో జాప్యాన్ని నివారించేందుకు ఫాస్టర్ విధానం అమలుకు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు సంబంధిత జైళ్లకు వెనువెంటనే చేరేందుకు ఫాస్టర్ విధానాన్ని అమలు చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అన్ని జైళ్లలో ఇంటర్‌నెట్ సౌకర్యాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సిఎస్ లకు సుప్రీం పేర్కొంది. అంతవరకూ నోడల్ ఏజెన్సీ ద్వారా ఫాస్టర్ విధానాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఖైదీలకు సుప్రీంకోర్టు శుభవార్త !

Supreme Court