NTV Telugu Site icon

Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Se

Se

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. అనంతరం నెమ్మదిగా పుంజుకుని లాభాల్లో ట్రేడ్ అయింది. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 131 పాయింట్లు లాభపడి 77, 341 దగ్గర ముగియగా.. నిఫ్టీ 36 పాయింట్లు లాభబడి 23, 537 దగ్గర ముగిసింది. నిఫ్టీలో ఎం అండ్ ఎం, శ్రీరామ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభపడగా.. సిప్లా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, టాటా స్టీల్ నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.3 శాతం చొప్పున పెరిగాయి.

ఇది కూడా చదవండి: Farmer Hulchul: కలెక్టరేట్ పైకెక్కి పురుగుల మందు తాగి రైతు హల్‌చల్

సెక్టార్లలో క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, టెలికాం మరియు పవర్ సూచీలు 0.5-1 శాతం పెరగగా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యు బ్యాంక్, మీడియా 0.5-1 శాతం క్షీణించాయి. మొత్తానికి ఉదయం సూచీలు ఒకలాగా ఉంటే.. సాయంత్రానికి గ్రీన్‌లోకి వచ్చేశాయి.

ఇది కూడా చదవండి: PM Modi: దేశ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ ఒక మచ్చ.. ఆ పొరపాటు మళ్లీ జరగొద్దు

Show comments