NTV Telugu Site icon

Stock Markets: భారీ పతనం నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు..

Stock Market

Stock Market

దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్ భారీ పతనం నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్ 692, నిఫ్టీ 201 పాయింట్లు పెరిగాయి. ఈ వారంలో షేర్ మార్కెట్ రెండు సార్లు రికార్డులు సృష్టించింది. సోమవారం రోజున మార్కెట్ సూచీలు ఆల్ టైమ్ హై వద్ద ముగిశాయి. మంగళవారం రోజున మార్కెట్‌లో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ఒడిదుడుకులకు ఎన్నికల ఫలితాలే కారణం. బుధ, గురువారాల సెషన్లలో స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు కొనసాగింది. కాగా.. భారీ పతనం నుంచి కొంతమేర మార్కెట్‌ కోలుకుంది. కాగా.. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి ముందే పలు ప్రభుత్వ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. రైల్వే, రక్షణ రంగ షేర్లు ఈరోజు మంచి రాబడులు ఇచ్చాయి. నేటి ట్రేడింగ్‌లో 10 శాతం పెరిగిన షేర్లలో HL, BHEL మరియు NBCC ఉన్నాయి.

Read Also: AP CEO Meet Governor: గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందజేసిన ఏపీ సీఈవో

ఎగ్జిట్ పోల్స్ కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్‌లో విపరీతమైన పెరుగుదల కనిపించింది. అదే సమయంలో.. మంగళవారం ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందు వచ్చిన ట్రెండ్స్‌లో సుస్థిర ప్రభుత్వంపై ఆశ లేకపోవడంతో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మార్కెట్‌లో కొంత జోరు నెలకొంది. గత సెషన్‌లో కూడా స్టాక్ మార్కెట్ గ్రీన్‌లో ట్రేడవుతోంది. మార్కెట్‌లో కొనసాగుతున్న ర్యాలీ కారణంగా, భారీ పతనం నుంచి కొంతమేర మార్కెట్‌ కోలుకుంది. ఈరోజు బిఎస్‌ఇ సెన్సెక్స్ 692.2 పాయింట్లు లేదా 0.93 శాతం లాభంతో 775,074.51 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 201.05 పాయింట్లు (0.89%) పెరిగి 22,821.40 పాయింట్ల వద్ద ముగిసింది.

Read Also: X – Elon Musk: ఇకపై “ఎక్స్” లో అధికారికంగా పోర్న్ వీడియోలు అప్లోడ్?