NTV Telugu Site icon

AP News: చిన్నారి లక్షిత సంఘటనపై నివేదిక కోరిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్

Lakshitha

Lakshitha

తిరుమల కొండపై శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి లక్షిత.. చిరుత బారిన పడి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదికను సమర్పించవలసిందిగా టీటీడీ, అటవీ, పోలీస్ మరియు రెవెన్యూ అధికారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు ఆదేశాలను జారీ చేశారు.

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. 15 ఏళ్ల లోపు చిన్నారులకు మధ్యాహ్నం 2 వరకే అనుమతి

ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ.. బాలికపై చిరుత దారుణంగా దాడిచేయడంతో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిదని తెలిపారు. అంతేకాకుండా.. జూన్ 22న కర్నూల్ జిల్లాకి చెందిన 4 ఏళ్ల కౌశిక్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయంలో కూడా.. బాలల కమిషన్ కలిచి వేసిందని, ఇటువంటి దురదృష్ట సంఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా తగు రక్షణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

Health News: అరటి పండు పరగడుపున తినొచ్చా?

ముఖ్యంగా చిన్నారులు మరియు వారి కుటుంబ సభ్యులు కాలినడకన తిరుమల దేవస్థానం చేరుకునే ప్రక్రియలో భాగంగా తక్షణమే పూర్తి స్థాయి నిఘా నీడలో సీసీ కెమెరాలు, ఇనుప స్తంభాలతో అమర్చిబడిన ఇనుప కంచెలు, విద్యుత్ దీపాలు , రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిందిగా కమిషన్ వారికి ఆదేశాలు ఇచ్చారు. కౌషిక్ సంఘటన జరిగిన తరువాత ఏమి చర్యలు తీసుకున్నారని.. వణ్య ప్రాణులకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు సేకరించాలని, జరిగిన సంఘటన పై పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు వారం రోజుల్లో సమర్పించాలని నాలుగు శాఖల అధికారులుకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చిన్నారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.