Site icon NTV Telugu

Varisu Movie Update: వారసుడు ఆడియో లాంచ్.. గ్రాండ్‎గా ఏర్పాట్లు చేస్తున్న మేకర్స్

Varasudu

Varasudu

Varisu Movie Update: దళపతి విజయ్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న వారసుడు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలవుతోంది. తెలుగులోనూ విజయ్ కు మంచి మార్కెట్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా డైరెక్ట్ గా తెలుగులోనూ విజయ్ నటిస్తున్నారు. పైగా శ్రీవెంకటేశ్వర క్రీయేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటం మరింతగా అంచనాలు పెంచేస్తోంది.

Read Also: Woman DeadBodies Found in Cupboard: ఆల్మారాలో కూతురు.. మంచం కింద తల్లి డెడ్ బాడీలు.. గుజరాత్ ఆస్పత్రిలో దారుణం

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇటీవలే విడుదలైన పోస్టర్లు, పాటలకు మంచి రెస్సాన్స్ దక్కుతోంది. చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ ‘రంజితమే’ ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ‘వారసుడు’ ఆడియో లాంఛ్ ను గ్రాండ్ గా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు చిత్ర మేకర్స్. డిసెంబర్ 24న సాయంత్రం 4 గంటలకు ఆడియో లాంచ్ ఉంటుందని తెలిపారు. దీంతో ఫ్యాన్స్, సినీ ప్రేమికులు ఖుషీ అవుతున్నారు. ‘వరిసు’ రిలీజ్ పై అటు వివాదాలు పుట్టుకొస్తున్నా.. మరోవైపు అంచనాలను పెంచేస్తూనే ఉంది. రీసెంట్ గా వచ్చిన ‘సోల్ ఆఫ్ వరిసు’తో మరింత హైప్ క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఖుష్బు, స్నేహ, జయసుధ, యోగి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version