మనుషుల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. చదువు కావచ్చు, ఆటలు కావచ్చు, డ్యాన్స్ లు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అలా అని ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. ఇప్పుడు ప్రతిభ(టాలెంట్) గురించి ఎందుకు
వచ్చిందనుకుంటున్నారా.. ఓ పిల్లాడు పాడే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం ఎక్కువగా రైళ్లలో, బస్సుల్లో కొందరు డబ్బులు అడుక్కునే వారు పాడే పాటలు ఎంతో చక్కగా ఉంటాయి. అచ్చం సింగర్ పాడినట్టే పాడుతారు. అలా తమ ప్రతిభను బయటపెట్టినందుకు తోచినంత డబ్బులు వేస్తారు. కానీ ఇక్కడ పిల్లవాడు మాత్రం తన గుండెల నుంచి పాడినట్టుగా చాలా అద్భుతంగా పాడాడు.
Read Also: Madhya Pradesh: ప్రేమికులని భావించి అన్నాచెల్లెలుపై దాడి.. రక్షాబంధన్ రోజు ఘటన
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఈ పిల్లాడి పాట మీ మనసుకు హత్తుకుంటుంది. అతన చిరిగిన పాత బట్టలు ధరించి ఉన్నాడు. అంతేకాకుండా.. అతని చేతిలో సిమెంట్ ప్లాస్టిక్ బ్యాగ్ కూడా ఉంది. ఈ బాలుడు చెక్క మంచం మీద కూర్చుని పాట పాడుతూ కనిపిస్తాడు. బిడ్డ పాడుతున్న పాటలో తల్లి లేని బిడ్డ జీవితం ఎలా అసంపూర్ణమవుతుందో చెబుతాడు.
Read Also: Pakistan Minister: ఫోన్ చోరీకి గురి కాకుండా ఉండాలంటే.. పాక్ మంత్రి వింత సలహా
చిన్నారి పాడిన ఈ పాట ఎవ్వరికైనా కన్నీళ్లు తెప్పించే విధంగా ఉంది. ఈ పాటను చూసిన జనాలు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వేలాది మంది ఈ వీడియోను వీక్షించగా, చాలా కామెంట్లు కూడా వచ్చాయి. యూజర్లు చిన్నారిని చాలా మెచ్చుకుంటున్నారు. ఇంత అందమైన స్వరం దేవుడిచ్చిన వరం అని ఓ యూజర్ ట్విట్టర్‌లో రాశారు. మరోవైపు కొంతమంది వినియోగదారులు వీడియోలో పిల్లాడి బాధను చూస్తున్నారు. కొందరు వ్యక్తులు ఈ వీడియోలో సోనూ సూద్‌ను కూడా ట్యాగ్ చేస్తున్నారు. పిల్లాడి సహాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హార్ట్ టచింగ్ వీడియో వైరల్ అవుతోంది.
माई बिना जिंदगी अधूरा! इस बच्चे का गाना आपके दिल को छू जाएगा! ❤️😍 pic.twitter.com/WWzYKTJIwA
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) September 5, 2023