NTV Telugu Site icon

Sundarakanda: ‘సుందరకాండ’లో సిధ్‌ శ్రీరామ్‌ పాడిన పాట విడుదల.. విన్నారా!

Sundharakanda

Sundharakanda

హీరో నారా రోహిత్ సినీ కెరీర్ లో ల్యాండ్‌మార్క్ 20వ చిత్రం సుందరకాండతో నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) పతాకంపై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళ్ళి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘బహుశా బహుశా’ పాటను సిధ్‌ శ్రీరామ్‌ పాడాడు. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం ఆ సాంగ్‌ లిరికల్‌ వీడియోను బుధవారం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట జనాలను ఆకట్టుకుంటోంది.

READ MORE: Mallikarjun Kharge: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చుంటే వారంతా జైల్లో ఉండేవారు

కాగా.. ఇటీవల సుందరకాండ టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. నారా రోహిత్ సిద్ధార్థ్ అనే పెళ్లి కానీ ఒంటరి వ్యక్తి పాత్రను పోషించాడు, అతను సాధారణ వివాహ వయస్సు దాటినప్పటికీ, తన ఐదు కండిషన్స్ కు ఒప్పుకునే అమ్మాయి కోసం వెతికే పనిలో ఎదుర్కొన్న ఇబ్బందులను కామిక్ వే లో చూపించారు. మూలా నక్షత్ర జాతకం కలిగిన వాడు 5నిమిషాల కంటే ఎక్కువ సేపు ఆనందంగా ఉండలేడు వంటి సంభాషణలు బాగా పేలాయి. తన క్యారెక్టరైజేషన్ మరియు కామిక్ టైమింగ్‌తో హాస్యాన్ని అందించే నారా రోహిత్‌కి ఈ పాత్ర టైలర్ మేడ్‌గా కనిపిస్తుంది. అతని సరసన వృతి వాఘని కథానాయిక. ప్రభాస్ డెబ్యూ సినిమా ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ దేవి విజయ్ కుమార్ ఈ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు, సీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ రోహిత్ తండ్రిగా కనిపించారు. వాసుకి ఆనంద్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్‌లో చూపినట్లుగా, ప్రతి వ్యక్తికి రిలేట్‌గా ఉండే కథాంశంతో ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఫన్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించారు.సెప్టెంబరు 6న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

 

Show comments