Delhi: హిందూ ఆలయాలపై దాడులు చేస్తే ఊరుకోం.. సిక్కుల భారీ నిరసన(వీడియో)
- కెనడాలో హిందువు ఆలయాలపై దాడులు
- భక్తులపై దాడి చేసిన ఖలిస్థానీ మద్దతుదారులు
- నేడు ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన సిక్కులు
- హిందూ ఆలయాలపై దాడులు చేస్తే ఊరుకోమని హెచ్చిరిక
- కెనడా హైకమిషన్ వెలుపల ప్రదర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై ఖలిస్థాన్ అనుకూల గుంపు దాడికి వ్యతిరేకంగా సిక్కు కార్యకర్తలు ఆదివారం న్యూఢిల్లీలోని కెనడా హైకమిషన్ వెలుపల ప్రదర్శన నిర్వహించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు, వివిధ హిందూ సంస్థల నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో చాణక్యపురిలోని డిప్లమాటిక్ ఎన్‌క్లేవ్‌లోని కెనడా హైకమిషన్ ముందు భద్రతను పెంచారు. ముందుజాగ్రత్తగా ఢిల్లీ పోలీసులు కెనడా హైకమిషన్ ముందు బరికేడ్లు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. హైకమిషన్ వైపు కవాతు చేస్తున్న హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్‌కు చెందిన పలువురు కార్యకర్తలు పోలీసు బారికేడ్లను ఎక్కేందుకు ప్రయత్నించి వారిని కిందకు లాగారు.
READ MORE: Donald Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతికి ట్రంప్ ప్రణాళిక ఇదేనా..?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
“హిందువులు, సిక్కులు ఐక్యంగా ఉన్నారు. కెనడాలో దేవాలయాలను అపవిత్రం చేస్తే భారతీయులు సహించరు.” అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేశారు. నవంబర్ 4న కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలో కాన్సులర్ క్యాంప్ జరుగుతున్నప్పుడు భక్తులపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేశాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కెనడాలోని హిందూ దేవాలయం వెలుపల భక్తులపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని, భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికి ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు.
READ MORE:Saffron Paint For Colleges: ప్రభుత్వ కళాశాలలకు కాషాయ రంగు వేయాలని ఉత్తర్వులు.. ఎక్కడంటే?
దాడి తరువాత, హిందూ సమాజం బ్రాంప్టన్ ఆలయం వెలుపల భారీ నిరసనను ప్రారంభించింది. మిస్సిసాగాలో కూడా ప్రదర్శనలు జరిగాయి. భారత వ్యతిరేక నినాదాలు చేసిన ఖలిస్థాన్ అనుకూల నిరసనలో పాల్గొన్నందుకు కెనడా పోలీసు అధికారి హరీందర్ సోహిని సస్పెండ్ చేశారు. హింస, తదుపరి నిరసనలకు సంబంధించి కెనడా అధికారులు నలుగురిని అరెస్టు చేశారు. భారతదేశంలో నిషేధిత సంస్థ అయిన సిక్కుల ఫర్ జస్టిస్ (SFJ) యొక్క టాప్ ఆపరేటర్ అయిన ఇంద్రజిత్ గోసల్ కూడా ఈ కేసులో అరెస్టయ్యాడు. గోసల్ హతమైన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ సహచరుడు. హిందూ సభ ఆలయం వెలుపల భక్తులపై ఆయుధాలతో దాడికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
#WATCH | Delhi: People of the Hindu Sikh Global Forum on their way to the High Commission of Canada, Chanakyapuri, to protest against the attack on a Hindu Temple in Canada, were stopped at Teen Murti Marg by Police. pic.twitter.com/ONaXu46gJi
— ANI (@ANI) November 10, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!