యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘డ్రాగన్’. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూట్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేస్తామని డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాపై నందమూరి అభిమానులు ఎన్నోఆశలు పెట్టుకున్నారు.
Also Read : TheRajasaab : రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ వాయిదా
కానీ ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ సంబందించిన ఓ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. ఇప్పటి వరకు తీసిన ఈ సినిమా ఫుటేజ్ ను స్క్రాప్ చేసేసారట. ఫస్ట్ షెడ్యూల్ చేసాక కొన్ని సీన్స్ ను రీషూట్ చేసారు. కానీ రీ షూట్ లో ప్రశాంత్ తీసిన అవుట్ ఫుట్ పట్ల ఎన్టీఆర్ సంతృప్తిగా లేడని అందుకే స్క్రాప్ చేసినట్టు టాక్. అలాగే కథలో మార్పులు చేర్పులు చేయమని కూడా ఎన్టీఆర్ సూచించనట్టు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ కు దర్శకుడు ప్రశాంత్ నీల్ కు మధ్య మనస్పర్థలు వచ్చినట్టు కూడా వినిపిస్తోంది. అందుకే షూటింగ్ కు గ్యాప్ కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చాలా బక్కగా అయ్యాడు. అలాగే గడ్డం పెంచే పనిలో ఉన్నాడు. ఎన్టీఆర్ – నీల్ కాంబోలో సినిమా అనగానే భారీగా బజ్ క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు ఈ సినిమా నుండి వస్తున్న వార్తలు ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. మరి వినిపిస్తున్న ఈ వార్తాలపై మేకర్స్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
