పుణే టెస్టులోనూ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 156 పరుగులకే కుప్పకూలగా… రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ భారీ ఆధిక్యంపై కన్నేసింది. కాగా.. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్సింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. దీంతో.. భారత్‌పై న్యూజిలాండ్ 301 పరుగుల ఆధిక్యం సాధించింది. కివీస్ కెప్టెన్ లాథమ్ 86 పరుగులతో రాణించారు. విల్ యంగ్ (23), డేరియల్ మిచెల్ (18) పరుగులు చేశారు. ప్రస్తుతం.. గ్లెన్ ఫిలిప్ 9, టామ్ బ్లండెల్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ఒక వికెట్ తీశాడు.
Read Also: Jathara: ట్రెండు వాడేసుకుంటున్న ‘జాతర’
రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్ తన కెరీర్‌లో తొలి 5 వికెట్లు పడగొట్టి మొత్తం 7 వికెట్లు సాధించాడు. కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 38 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.