TS EAMCET : ఐదురోజుల పాటు సజావుగా సాగిన ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయని అధికారులు ప్రకటించారు. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు పరీక్షలు నిర్వహించగా, 12,13,14 తేదీల్లో ఇంజినీరింగ్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం పరీక్షలకు 94.11 శాతం విద్యార్థులు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు.
Read Also:Akkineni: నాగార్జునకు అలా… నాగ చైతన్యకు ఇలా!
పరీక్షల ఫలితాలు ఈ నెల చివరి వారంలో విడుదల కానున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు.. ఈ నెల 26 నుంచి 30 తేదీల మధ్య ఫలితాలను విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ సారి ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ నిబంధనను ఎత్తివేశారు. దీంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకణ, ఫైనల్ కీ విడుదల, నార్మలైజేషన్ ప్రక్రియ అనంతరం ఫలితాలను విడుదల చేస్తామని జేఎన్టీయూ అధికారులు ప్రకటించారు.
Read Also:CBI Director: సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్.. కర్ణాటక డీజీపీకి కేంద్రం కీలక బాధ్యతలు
ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను సోమవారం విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్, కోకన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి 8 గంటల నుంచి https://eamcet. tsche.ac. in వెబ్‌సైట్ నుంచి రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రాథమిక కీపై ఈ నెల 17న రాత్రి 8 గంటల వరకు అభ్యంతరాలు తెలుపవచ్చని పేర్కొన్నారు.