Site icon NTV Telugu

Surekha Vani : సురేఖ వాణి కెరీర్ పాడు చేసింది ఆ స్టార్ హీరోనా?

తెిార్ల

తెిార్ల

Surekha Vani: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి పేరు ఇటీవల సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. అందుకు కారణం నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో సురేఖ వాణి పేరు వినిపించడమే. ఆ నిర్మాత డ్రగ్స్ కేసులో దొరికిన దగ్గరనుంచి వాటితో సంబంధం ఉందంటూ అషు రెడ్డి, జ్యోతి వంటి వాళ్ల పేర్లు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా సురేఖ వాణి కేపీ చౌదరితో ఒక పబ్లిక్ ఏరియాలో కిస్ చేసుకుంటున్న ఫొటోస్ నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. దీంతో ఆమెను నిజంగానే డ్రగ్స్ తీసుకుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమాల్లో సురేఖ వాణి చాలా హోమ్లీ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె మొదట ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయమై ఆ తర్వాత ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అక్క, వదిన, అత్త, అమ్మ పాత్రల్లో నటించింది. సురేఖ వాణికి ఈ మధ్య సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. దీంతో సోషల్ మీడియాలో తన కూతురితో పోటీపడి కురచ దుస్తులు ధరించి పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేస్తూ ఉన్న మంచి ఇమేజ్ ను కాస్త పాడు చేసుకుందంటూ పలు విమర్శలు వచ్చాయి. సినిమాల్లో హోమ్లీ క్యారెక్టర్లతో పాజిటివ్ నెస్ ఏర్పరచుకున్న సురేఖ తన మీద ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ మొత్తం నెగిటివ్ గా మార్చేసుకుంది.

Read Also:Revanth Reddy: రేపు ఖమ్మం జిల్లా పర్యటనకు రేవంత్ రెడ్డి

సురేఖవాణి కి అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం మాస్ మహారాజ్ రవితేజ అని ఇండస్ట్రీలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇక రవితేజ నటించిన సినిమాల తోనే సురేఖ వాణి ఎక్కువగా ఫేమస్ అయింది. రవితేజ సినిమాల్లో సురేఖ వాణి చేసిన సంగతి తెలిసిందే. రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా టైంలో సురేఖ వాణి కి రవితేజకి మధ్య గొడవలు జరిగాయని అప్పటినుండి సురేఖ వాణి కి అవకాశాలు రావడం లేదంటున్నారు. దీనికి ప్రధాన కారణం రవితేజేనని టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. అయితే ఇందులో అసలు నిజం ఏంటో తెలియదు కానీ సురేఖ వాణికి అవకాశాలు తగ్గాయనడంలో సందేహం అయితే లేదు.

Read Also:Virupaksha: విరూపాక్ష డైరెక్టర్ కి సర్పైజ్ ఇచ్చిన హీరో, నిర్మాత

Exit mobile version