Real Mafia: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా దశాబ్దాల క్రితం మూతపడింది. కానీ, ఈ భూముల విలువ కోట్లలో పలుకుతోంది. దీంతో సీసీఐ భూములపై కన్నేసాయి రియల్ మాఫియాలు. ఇప్పటికే ఫ్యాక్టరీ పనిముట్లు అన్ని తుప్పు పట్టే స్థాయికి చేరిపోయాయి..కూలుతున్న గోడలు, పనికిరాని పరికరాలతో పిచ్చి చెట్లు పొదలతో ఉండిపోయింది..అయితే భూములు, పనిముట్ల రక్షణ కోసం సీసీఐ కి చెందిన అధికారులున్నారు..కానీ, లీజ్ ల్యాండ్ లు, సిమెంట్ పరిశ్రమకు ఉపయోగపడే లైమ్ స్టోన్ తరలించుకుపోతున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో బడా బాబులు, రియల్ వ్యాపారులు వెంచర్లు వేస్తూ తెగనమ్ముతున్నారు.
Read Also : Gun Fire : చికాగోలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు
సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలో 2 వేల ఎకరాల భూమి ఉంది..ఇందులో 800 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి, మరో 12వందల ఎకరాల లీజు భూములు ఉన్నాయి. అయితే ఉత్పత్తి లేకపోవడం, అలాగే వృథాగా ఉండటంతో భూములపై అక్రమార్కుల కన్నుపడింది. నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి లీజు స్థలాల సాకు చూపెడుతూ భూములు ఆక్రమించేస్తున్నారు రియల్టర్లు. రాజకీయనేతల పలుకుబడితో మరి కొంతమంది సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బడా లీడర్ల అండతో రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. తాజాగా భూములు కబ్జా, అలాగే రియల్ వెంచర్లు వేసే ప్రదేశానికి వివిధ పార్టీలు, సంఘాల నాయకులు వెళ్లి పరిశీలించారు. కబ్జా కాకుండా భూములను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.. లీజ్ ల్యాండ్ అయితే ఎన్ ఓసీ ఎవ్వరు ఇచ్చారని, రియల్ వ్యాపారులకు ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ప్రశ్నలొస్తున్నాయంటున్నారు బీజేపీ నేతలు.
Read Also: Tollywood: విషాదంలో టాలీవుడ్.. సుధీర్ అంత్యక్రియలు పూర్తి
అత్యంత నాణ్యమైన.. కోట్లు విలువ చేసే లైమ్ స్టోన్ తవ్విపోస్తున్నారు మరి కొందరు కేటుగాళ్లు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసామని సీసీఐ అధికారులు చెబుతున్నారు. రియల్ వ్యాపారులు మాత్రం యధేచ్చగా భూములు అమ్ముకుంటున్నారు. రియల్ వెంచర్లు, ప్లాట్లుగా చేసి అమ్మడంలో పాత్ర ఎవ్వరిది, భూములను సీసీఐ వదిలేసుకుంటుందా అనే దానిపై చర్చ జోరుగా సాగుతోంది.