ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించారు. అందులో భాగంగా రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ప్రధాని ఇక్కడి అగ్ని తీర్థంలో సముద్ర స్నానమాచరించారు. అంతేకాక ఆలయంలోని తీర్థ బావుల పవిత్ర జలాలనూ ఒంటిపై పోసుకున్నారు. అనంతరం ‘శ్రీరామాయణ పారాయణ’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
U-19 WC: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం..
రామేశ్వరంలో ఉన్న శివాలయం రామాయణ కాలానికి చెందినది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని శ్రీరాముడు స్థాపించాడని, దీనిని రాముడు, తల్లి సీత పూజించారని చెబుతారు. రావణాసురుడిని వధించిన తర్వాత రాముడు పాపాన్ని పోగొట్టుకునేందుకు ఇక్కడి సముద్ర తీరంలో శివలింగాన్ని తయారుచేసి పూజించాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామనాథస్వామి ఆలయంలోని శివలింగం ఒకటి. ఏడాది పొడవునా లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి అగ్నితీర్థం సహా 22 తీర్థ బావుల్లోని పుణ్య జలాలను అయోధ్యకు తీసుకెళ్తున్నారు.
Vishweshwar Reddy: ఎంపీ రంజిత్ రెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు..
కాగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తోన్నారు. ఇంతకుముందు మహారాష్ట్ర నాసిక్‌లోని రామ్‌కుండ్ కాలారామ్ దేవాలయం, ఆంధ్రప్రదేశ్ లేపాక్షిలోని వీరభద్ర ఆలయం, కేరళ గురువాయుర్ ఆలయం, త్రిప్రయార్ రామస్వామి దేవాలయాలను దర్శించుకున్నారు. శనివారం తిరుచిరాపల్లి రంగనాథస్వామి, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. కాగా.. జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
