NTV Telugu Site icon

Non Veg Market: పండగ పూట మటన్, చికెన్ ధరలకు రెక్కలు..

Chiken

Chiken

పండగ పూట మటన్, చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో నాన్ వెజ్ తినే వారికి ఈ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ రెండ్రోజులు అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పండగ ఏదైనా మటన్.. చికెన్ కంపల్సరీ.. దీంతో నాన్ వెజ్ ప్రియుల జేబులకి చిల్లులు పడుతున్నాయి. సాధారణ రోజుల్లో మటన్ ధర రూ. 800 ఆ పైన ఉంటే పండగ పూట రూ. 1000 కి చేరువలో ఉంది. కాగా.. ఉదయం నుంచి మటన్, చికెన్ షాప్స్ వద్ద జనం బారులు తీరారు. పండగ పూట మటన్ లో 24 వెరైటీల మెనూ ఉంది. చికెన్ లో దాదాపుగా 10 వెరైటీలు ఉన్నాయి. ధరలు ఎక్కువగా ఉన్నా అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి.

READ MORE: Sankrantiki vastunnam : వెంకీ మామ కెరీర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్.. ఎన్నికోట్లు కలెక్ట్ చేసిందంటే

పండగ వేళ ఆటలు, పాటలు, ముగ్గుల పోటీలు, కోడి పందాలు, గుండాటలు.. ఇలా అంతా కోలాహలంగా సాగుతోన్న పండుగ చివరి రోజుకు చేరుకుంది.. ఇక, కనుమ పండుగ సందర్భంగా నాన్‌వెజ్‌ మార్కెట్లు రద్దీగా మారిపోయాయి.. చికెన్, మటన్, చేపలు ఇలా నాన్‌వెజ్‌ను కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు తరలివస్తున్నారు జనం.. కనుమ రోజు అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాన్ వెజ్ మార్కెట్లలో రద్దీ వాతావరణం నెలకొంది. భోగి, సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకున్న జిల్లా వాసులు కనుమ రోజు నాన్‌వెజ్‌ వంటకాలతో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు.

READ MORE: PM Modi: యుద్ధనౌకలు, జలాంతర్గామినీ జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

Show comments