NTV Telugu Site icon

Mouse Milk : వామ్మో..! ఎలుక పాలు 18 లక్షలా..!

Untitled 23

Untitled 23

viral news: నిత్య జీవితంలో పాలకి చాల ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. మనం సాధారణంగా గేదె లేదా ఆవు పాలను వినియోగిస్తుంటాము. కొందరు మేక పాలు కూడా వినియోగించుకుంటారు. అయితే గత కొంత కాలంగా కొన్ని వ్యాధులను నివారిస్తుంది అంటూ గాడిద, ఒంటె పాలను కూడా విక్రయిస్తున్నారు. ఈ పాల ధర వేళల్లో ఉంటుంది. దీనికే మనం ఆశ్చర్య పోతుంటాము. అయితే ఎక్కడైనా లీటరు పాల ధర లక్షల్లో ఉంటుందా..? అంటే ఉంటుంది అంటున్నారు కొందరు విజ్ఞావంతులు. అది కూడా పరిమాణం లో పెద్దగా ఉండే జంతువు పాలు కాదు. ఆ జంతువు పరిమాణంలో చాలా చిన్నగా ఉంటుంది. ఇంతకీ ఆ జంతువు ఏంటి అనుకుంటున్నారా..? అదే ఎలుక.. ఏంటి.. ఎలుక పాలకు లక్షల్లో ధర ఉందా..? చాల్లే నమ్మే వాళ్ళు ఉంటె ఏనుగు ఏరోప్లేన్ ఎక్కింది అని చెప్తారు మీరు అని అనుకుంటున్నారా..?

Read also:Visakhapatnam: ప్రియుడితో వచ్చింది… వాడు పరార్.. ప్రేయసి బేజార్

అలా అనుకుంటే పొరపాటే నిజంగానే ఒక లీటర్ ఎలుక పాల ధర 23 వేల యూరోలు. అంటే మన కరెన్సీ లో 18 లక్షలు. ఎందుకు ఈ పాలకు అంత ధర అంటే.. ఒక లీటరు ఎలుక పాలను తియ్యడానికి దాదాపు 40 వేల ఎలుకలు అవసరం అవుతాయి. అంత కష్టపడి ఈ పాలను సేకరించడం ఎందుకు అంటే.. ఈ పాలను సైంటిస్ట్ లు పరిశోధనల్లో వినియోగిస్తున్నారు. ఎలుక పాలను మలేరియా బాక్టీరియాను చంపే మెడిసిన్స్ కు ఉపయోగిస్తారట. ఇప్పటి వరకు ఆవు పాలను మలేరియా బాక్టీరియాను చంపే మెడిసిన్స్ లో ఉపయోగించే వారు. అయితే ఆవు పాల కంటే ఎలుక పాలల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయంట. అందుకనే ఈ పాలను పరిశోధనల్లో వినియోగిస్తున్నారు.

Show comments