NTV Telugu Site icon

Dail 100 : కిడ్నాపర్ల దాడి.. 100 డయల్ చేయడంతో తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు..

Police

Police

డయల్ 100పై వెంటనే స్పందించి కిడ్నాపర్ల చేతిలో హత్యకు గురవుతున్న బాధితుడిని రక్షించారు. బాధితుడిని ఆస్పత్రికి సరైన సమయానికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడిన బండ్లగూడ పోలీసుల పనితీరును స్థానికులు,బాధితుని బంధువులు , సామాజిక మాధ్యమాల్లో చూసినవారు బండ్లగూడ పోలీసుల పనితీరును మెచ్చుకుంటు ప్రశంసలు కురిపిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ ఇస్మాయిల్ నగర్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ ఐజాజ్ జహంగీరబాద్ కు చెందిన ఖతిజ పరిచయిస్తులు, కొంతకాలంగా ఐజాజ్ ఖతిజను లైగింగా వేధిస్తున్నాడు, వేధింపులు ఎక్కువకావడంతో ఖతిజ తన భర్త,కొడుకు తో కలిసి ఐజాజ్ ను మాట్లాడుకుందాం అని పిలిపించుకుని అక్కడి నుండి భర్త,కొడుకు సహాయంతో అపహరించి ఆటోలో తీసుకెళ్తుండగా బాధితుడు ఐజాజ్ తన తల్లికి ఫోన్ చేసి తనను బలవంతంగా ఎత్తుకెళ్తున్నారు నన్ను చంపేస్తారు అని చెప్పాడు, వెంటనే 100డయల్ కు బాధితుడి తల్లి ఫోన్ చేసి విషయం తెలిపింది.

  Pawan Kalyan: తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది..

ఈ సమాచారం అందుకున్న బండ్లగూడ ఇన్స్పెక్టర్ కె సత్యనారాయణ,ఎస్ ఐ ఆర్,పవన్ వారి సిబ్బందితో రెండు టీంలుగా బాధితుడిని రక్షించడంకోరకు రంగంలోకి దిగి మొబైల్ లొకేషన్ ను అనుసారిస్తూ లేక్ వ్యూ హిల్స్ కు చేరుకున్నారు, అప్పటికే నిందితులు బండ రాయితో కొడుతున్నారు, వెంటనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని రక్తపు మడుగుల్లో ఉన్న ఐజాజ్ ను ఎలాంటి ఆలస్యం చేయకుండా సిఐ ఆదేశాలతో యస్, ఐ. ఆర్, పవన్ తమ పోలీస్ వాహనంలోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి ప్రాణాలు కాపాడారు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు ఈ నేరానికి పాల్పడ్డ ఖతిజ అతని భర్త ఫారూఖ్, కొడుకు ఫైసల్ ను ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద నుండి నేరానికి ఉపయోగించిన ఆటో,2 మొబైల్ ఫోన్లు,దాడికి ఉపయోగించిన బండ రాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే పోలీసులను ఆశ్రయించి న్యాయ సహాయం తీసుకొని సమస్య పరిష్కారం చేసుకోవాలని చట్టాన్ని చేతిలోకి తీసుకొని కటకటాల పాలు కావద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Pune: ప్రియురాలి కోసం? చనిపోయిన 5రోజులకు తిరిగి వచ్చిన వ్యక్తి.. ఇంతకీ దయ్యమా? మనిషా?