Poured Urine : ఈ మధ్య లోన్ యాప్ వేధింపుల గురించి తరచూ వార్తల్లో వింటూనే ఉన్నాం. వారి వేధింపులు తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు సైతం తీసుకున్న ఉదంతాలు ఉన్నాయి. అప్పు చేసి తీర్చే తాహతు లేకపోవడంతో ఇచ్చిన వాళ్లు తీసుకున్న వారిపై దారుణాలకు ఒడిగట్టుతున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఇచ్చిన అప్పు తీర్చమన్నందుకు ఓ వృద్ధుడికి నీచమైన సమాధానం ఇచ్చాడో కేటుగాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ముసలాయనపై దాడి చేసి, మూత్రం పోశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ముసలాడికి జరిగిన అవమాన ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: MLA Rapaka Varaprasad: ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు ఊరట
ఆగ్రాలో నివసించే ఛత్తర్ సింగ్ కుష్వాహా(76).. తన ఇంటికి సమీపంలో ఉండే ఓ వ్యక్తికి ఏప్రిల్ 30వ తేదీన రూ.14 వేలు అప్పుగా ఇచ్చాడు. తీసుకున్న వ్యక్తి పేరు మూల్ చంద్. డబ్బులు తీసుకొని 10 రోజులు దాటడంతో వృద్ధుడు మూల్ చంద్ ఇంటికి వెళ్లాడు. తన అప్పు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. దీంతో మూల్ చంద్ అతడు ఆగ్రహానికి లోనయ్యాడు. డబ్బులు ఇవ్వబోనని తేల్చిచెప్పాడు. తన కొడుకుతో కలిసి కుష్వాహాపై దాడి చేశాడు. తీవ్రంగా చితకబాదాడు. అంతటితో ఊరుకోకుండా.. వృద్ధుడిపై మూల్ చంద్ కుమారుడు మూత్ర విసర్జన చేశాడు. తనపై జరిగిన దాడిని వివరిస్తూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:MLA Rapaka Varaprasad: ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు ఊరట