Site icon NTV Telugu

The Paradise: ‘ద ప్యారడైజ్’ నుండి ‘సుబ్బు’ వచ్చేసింది.. నాని హీరోయిన్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!

Nani The Paradise Movie Update, Kayadu Lohar

Nani The Paradise Movie Update, Kayadu Lohar

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ద ప్యారడైజ్’ (The Paradise) పై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి పాట ‘ఆయా షేర్’ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తుండగా, తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కయాడు లోహర్ పుట్టినరోజు (ఏప్రిల్ 11) సందర్భంగా, చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె ‘సుబ్బు’ (సుబ్బలక్ష్మి) అనే పాత్రలో నటిస్తోంది.

Also Read : Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ రిలీజ్ డేట్ల ఫిక్స్.. ఏకంగా ఐదు భాషల్లో స్ట్రీమింగ్!

పోస్టర్‌ను గమనిస్తే.. కయాడు లోహర్ వింటేజ్ లుక్‌లో చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. సైకిల్‌పై వెళ్తున్న ఆమె లుక్, పీరియాడికల్ డ్రామాకు తగ్గట్టుగా చాలా సహజంగా ఉంది. ‘డ్రాగన్’ వంటి సినిమాలతో మెప్పించిన కయాడు, ఇప్పుడు నాని సరసన ‘ద ప్యారడైజ్’లో నటిస్తుండటంతో ఆమె కెరీర్‌కు ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమాలో నాని ఒక పవర్‌ఫుల్ అడవి బిడ్డగా కనిపిస్తుండగా, కయాడు ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా కనిపిస్తుందని సమాచారం. ఈ వైవిధ్యమైన ప్రేమకథ వెండితెరపై ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు, రాఘవ్ జుయల్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version