Site icon NTV Telugu

The Paradise : ‘ది ప్యారడైజ్’ BTS వీడియో వైరల్..

Shah Rukh Khan Injury

Shah Rukh Khan Injury

నేచురల్ స్టార్ నానితో ‘దసరా’ లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌ను తీసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఇప్పుడు తన రెండో సినిమా ‘ది ప్యారడైజ్’ తో మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్, నానిని ఒప్పించి ‘దసరా’తో సూపర్ హిట్ కొట్టడం అనేది అతని ప్రతిభకు నిదర్శనం. అలాంటి డైరెక్టర్ నుంచి రెండో సినిమా అనగానే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో, నానితోనే కలిసి ‘ది ప్యారడైజ్’ అనే క్రేజీ అటెంప్ట్‌కు శ్రీకాంత్ ఓదెల రెడీ అవుతున్నాడు. అయితే తాజాగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పుట్టినరోజు సందర్భంగా ‘ది ప్యారడైజ్’ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ టు షూట్ (BTS) వీడియోను రిలీజ్ చేశారు.

Also Read : Chiru & Balaya : ‘అఖండ2’ దెబ్బతో.. బాలయ్య‌కు ప్రశంసలు.. చిరంజీవి‌కి ప్రశ్నలు

ఈ వీడియో చూస్తే, ఈ సినిమా కోసం శ్రీకాంత్ ఎంత కష్టపడుతున్నాడు, తన పని పట్ల ఎంత డెడికేషన్‌తో ఉన్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ BTS వీడియో నాని ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే పాత్రలో ఒక డిఫరెంట్, వీర లెవల్ మాస్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియో గూస్ బంప్స్ ఇచ్చింది. ముఖ్యంగా, ఈ BTS వీడియోకు అనిరుధ్ రవిచంద్రన్ ఇచ్చిన మ్యూజిక్ అయితే మాటల్లేవు అనేలా ఉంది.

శ్రీకాంత్ ఓదెల టాలెంట్ గురించి ‘దసరా’తో ఆల్రెడీ అందరికీ తెలిసింది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ సినిమాతో దాన్ని మించి హిట్‌ కొట్టేందుకు నాని రెడీ అవుతున్నాడని చెప్పవచ్చు. నాని స్టోరీ సెలెక్షన్ అద్భుతంగా ఉంటుందనే పేరు ఈమధ్య వచ్చిన వరుస హిట్‌లతో మరింత పెరిగింది. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్‌గా నటిస్తుండటం మరో అదనపు ఆకర్షణ. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబో మరో అద్భుతాన్ని సృష్టిస్తుందని ఆడియన్స్ ఆశిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2026 మార్చి 26న విడుదల చేయాలని మేకర్స్ లాక్ చేశారు.

 

Exit mobile version