NTV Telugu Site icon

Chandramukhi : 31 ఏళ్ల తర్వాత మరోసారి జనాల మధ్యకు వస్తున్న ఒరిజినల్ చంద్రముఖి

New Project (46)

New Project (46)

Chandramukhi : రజనీకాంత్‌ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. 2005లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ముఖ్యంగా అందులో జ్యోతిక నటన తమిళ, తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ‘లక లక లక’ అంటూ రాజుగా రజనీ పలికే ఊత పదం అప్పట్లో అందరి నోళ్లలోనూ నానింది. ఇక ‘వారాయ్‌.. నానున్నయ్ తోటి.. వందే నిన్నె ఉక్కుండాడి. మంజమే నానిదే ఎన్నయం కైకుడు తోగయుం తోలిమ వాడ’ అంటూ తమిళంలో సాగే పాట తెలుగు జనాలకు బాగా దగ్గరైంది. స్కూళ్లు, కాలేజీల్లో జరిగే ప్రోగ్రాంలలో ఈ పాటకే ఎక్కువగా విద్యార్థులు నృత్యం చేసేవారు. ఈ సినిమాను దర్శకుడు పి.వాసు చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు.

Read Also:Paramilitary Attack: పారామిలటరీ బలగాల నరమేధం.. 80 మంది సామాన్యులు హతం

రజినీకాంత్ అలాగే జ్యోతికల కాంబోలో వచ్చిన ఈ చిత్రం తమిళ్ సహా తెలుగులో కూడా పెద్ద హిట్ అయ్యింది. కానీ ఈ చిత్రం ఒరిజినల్ కాదు.. దీన్ని కన్నడ చిత్రం ‘ఆప్తమిత్ర’ కి రీమేక్ అని చాలా మందికి తెలిసిన విషయమే. కానీ… ఇది కూడా ఒక రీమేక్ అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరి అసలు ఆ ఒరిజినల్ చంద్రముఖి ఎవరు? ఎక్కడ నుంచి ఆమె పుట్టుకొచ్చింది. అంటే ఇది మొట్ట మొదటిగా మళయాళ సినిమాలో పుట్టింది. స్టార్ హీరో మోహన్ లాల్ అలాగే నటి శోభన కాంబోలో వచ్చిన సినిమానే “మణిచిత్రతాజు”. 1993 లో దర్శకుడు ఫాజిల్ తెరకెక్కించిన ఈ చిత్రం నుంచే చంద్రముఖి, ఆప్తమిత్ర ఇలా చాలా భాషల్లో కొత్త సినిమాలుగా రీమేక్ అయ్యాయి. మరి ఇప్పుడు ఫైనల్ గా ఒరిజినల్ చంద్రముఖి రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. 4కే లో అప్ డేట్ చేసి డాల్బీ అట్మాస్ మిక్స్ తో 31 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని మేకర్స్ రీ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. అయితే ఇంకా డేట్ ఎప్పుడనేది ఇంకా అనౌన్స్ కాలేదు. ఒరిజినల్ సినిమాని చూడాలి అనుకునేవారు మాత్రం రిలీజ్ డేట్ కోసం ఆగాల్సిందే.

Read Also:AP Speaker Ayyanna Patrudu: అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి.. స్పీకర్‌గా నేను అవకాశం ఇస్తా..