Site icon NTV Telugu

Animal : బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న యానిమల్ కలెక్షన్ల పరంపర..

Whatsapp Image 2023 12 09 At 8.00.17 Pm

Whatsapp Image 2023 12 09 At 8.00.17 Pm

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది. వీక్ డేస్ లో కూడ హౌల్​ఫుల్​ షోస్​తో ప్రదర్శితమౌతూ, కాసుల వర్షం కురిపిస్తోంది.రీసెంట్‌గా ఈ సినిమా 500 కోట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం 8 రోజులకు గాను రూ. 600 కోట్ల మార్క్‌ను అందుకుంది.. కాగా, ఎనిమిదో రోజైన శుక్రవారం ఒక్క హిందీలోనే ఏకంగా రూ. 21.56 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.ఈ సినిమాతో రణ్ బీర్ కపూర్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ సందీప్ ఈ సినిమాలో రణ్ బీర్ ను ఎంతో వైలెంట్ గా చూపించారు.

ఈ సినిమాలో రణబీర్‌ కపూర్‌ కు నాన్న అంటే పిచ్చి ప్రేమ.. చిన్నప్పట్నుంచీ తనకు తండ్రి అంటే ఓ సూపర్‌హీరో. కానీ తండ్రి నుంచి మాత్రం అతను ఆశించిన ప్రేమ దక్కదు. అయినా సరే నాన్నంటే మాత్రం ఎంతో ఇష్టం.. తన కుటుంబాన్ని కూడా అమితంగా ప్రేమిస్తుంటాడు. తనవాళ్లకు ఏమైనా చిన్న సమస్య వచ్చినా ఎంతో వైల్డ్‌గా రియాక్టవుతుంటాడు. ఆ కారణంచేత తండ్రి కోపానికి గురవుతుంటాడు. ఇంట్లోవాళ్లకు ఇష్టంలేని పెళ్లి చేసుకొని కుటుంబానికి దూరమైన విజయ్‌, కొన్నాళ్ల తర్వాత భార్యా పిల్లలతో కలిసి తన ఇంటికి చేరుకుంటాడు. అప్పడే తెలుస్తుంది అతనికి తన తండ్రి ఆపదలో ఉన్నాడని. తన తండ్రిపై జరిగిన హత్యాప్రయత్నం గురించి తెలుసుకొని, దీనికి కారణమైన వాళ్లను వెతికి చంపాలనుకుంటాడు.. ఈ ప్రయత్నంలో అతనికి ఎదురైన సమస్యలేంటి.. అనేది మిగితా కథ.

Exit mobile version