NTV Telugu Site icon

Gaddar: కొనసాగుతున్న ప్రజా యుద్ధనౌక గద్దర్ అంతిమయాత్ర..

Ganpark

Ganpark

ఎల్బీ స్టేడియం నుంచి ప్రజా యుద్ధనౌక, ప్రజాకవి గద్దర్‌ అంతిమయాత్ర కొనసాగుతుంది. గన్‌పార్క్‌, అసెంబ్లీ, నెక్లెస్‌రోడ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం, ట్యాంక్‌బండ్‌, జేబీఎస్‌, తిరుమలగిరి మీదుగా అల్వాల్‌ చేరుకోనుంది. గద్దర్‌ ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అల్వాల్ భూదేవి నగర్‌లోని మహాభోది విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మహాభోధి విద్యాలయంలోని గ్రౌండ్ వెనకాల సమాధి కోసం చేస్తున్న ఏర్పాట్లను గద్దర్‌ కూతురు వెన్నెల దగ్గరుండి చూసుకున్నారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను మేడ్చల్ డీసీపీ సందీప్‌రావు పరిశీలిస్తున్నారు.

Read Also: Paytm stocks: 11 శాతం పెరిగిన పేటియం స్టాక్.. ఈ సారి పెరుగుదలకు కారణం వేరే

గద్దర్ అంతిమ యాత్ర వాహానానికి జై బీం జెండాలతో పాటు బుద్దిడి పంచశీల జెండాలను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే, గద్దర్ పార్థివదేహానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళిలు ఆర్పించారు. మరోవైపు అల్వాల్ లోని గద్దర్ నివాసం దగ్గర తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మంత్రి సబిత ఇంద్రారెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌ తో పాటు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తదితరులు నివాళులు అర్పించారు. అయితే, గద్దర్ అంతిమయాత్రలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులతో పాటు, ఆయన అభిమానులు, కళాకారులు భారీగా పాల్గొని.. కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.

Read Also: OnePlus 10 Pro 5G Price: అమెజాన్‌‌లో బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 17 వేల తగ్గింపు!