Site icon NTV Telugu

RT 76 : టైటిల్ కూడా ఫిక్స్ కాకుండానే నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్

Rt76

Rt76

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు మాస్ మ‌హారాజ. ప్రస్తుతం భాను భోగ‌వర‌పు ద‌ర్శక‌త్వంలో చేస్తున్న ‘మాస్ జాత‌ర’ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరు 31న రిలీజ్ కు రెడీ అవుతోంది. మాస్ జాతర సెట్స్ పై ఉండగానే  త‌న నెక్ట్స్ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ ఇప్పడు ఆ సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమ‌ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ.

Also Read :  Kishkindhapuri : బెల్లం పైనే ఉప్మా ఆశలన్నీ.. ఆశ తీరుస్తాడా?

రవితేజ కెరీర్ లో 76వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రవితేజ స్టైల్ కామెడీ, కిషోర్ టేకింగ్ లో ఉండే ఎమోషన్స్ తో కలగలిపి పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా రాబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ అయింది. ప్రముఖ ఓటీటీ నిర్మాణ సంస్థ జీ5 రవితేజ – కిషోర్ తిరుమల సినిమా ఓటీటీ రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ ను కూడా కొనుగోలు చేసింది. ఇంకా టైటిల్ కూడా అధికారకంగా ప్రకటించని సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయి అంటే జాక్ పాట్ అనే చెప్పాలి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా  అక్టోబర్ నెలాఖరుకు మొత్తం వర్క్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో SLV సినిమాస్ బ్యానర్‌పై  సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.

Exit mobile version