NTV Telugu Site icon

New Zealand: ఈసారి వదిలేదు.. కప్ మాదే..!

Newzland

Newzland

వన్డే ప్రపంచకప్‌-2023కి ముందు న్యూజిలాండ్‌ జట్టు అన్ని టీమ్లకు బిగ్ వార్నింగ్‌ ఇచ్చింది. ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో 300 ప్లస్‌ స్కోర్లు చేసి ప్రత్యర్థి జట్లకు హడల్ పుట్టించింది. మాతో జాగ్రత అని ఓ మెస్సేజ్ పంపింది. ప్రపంచ కప్ లో వరుసగా రెండుసార్లు ఓడిపోయామని.. ఈసారి వదిలేది లేదని ప్రపంచకప్‌ లో ఆడుతున్న ఆశావాధులకు వార్నింగ్ ఇచ్చిం‍ది. తొలి వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టును కివీస్ జట్టు బెంబేలెత్తించింది. పాకిస్తాన్ చేసిన 346 పరుగుల టార్గెట్ ను అలవోకగా చేధించింది. ఈరోజు సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లోనూ కివీస్ బ్యాట్స్ మెన్స్ మంచి ఫాం చూపిస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ జట్టు 321 పరుగులు చేసింది. అయితే కివీస్ బ్యాటర్లు ఇలా దంచికొడుతుంటే భారత్ సహా అన్ని జట్లకు వణుకు మొదలైంది.

Pawan Kalyan: అంచలంచలుగా అధికారంలోకి రాగలం.. ఒకేసారి గెలవలేం..

ఈసారి కివీస్‌ ప్రదర్శన చూస్తుంటే.. టైటిల్ సాధించేలా కనిపిస్తుంది. అయితే కివీస్‌ బ్యాటర్లను ఎలాగైనా ఆపేందుకు అన్ని జట్లు ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నాయి. కేన్‌ విలియమ్సన్‌, డెవాన్‌ కాన్వే, డారిల్‌ మిచెల్‌, టామ్‌ లాథమ్‌, మార్క్‌ చాప్‌మన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్రలను కంట్రోల్‌ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాయి. ముఖ్యంగా గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేన్‌ మామపై అన్ని జట్లు ప్రత్యేక నిఘా పెట్టాయి.

Earthquake: మేఘాలయలో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు

ఇక కివీస్ బౌలింగ్‌ విభాగంలో మొదటినుంచి బలంగా ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న బౌల్ట్‌, మ్యాట్‌ హెన్రీ, టిమ్‌ సౌథీ, లోకీ ఫెర్గూసన్‌లతో కివీస్‌ పేస్‌ విభాగం బలంగా ఉంది. మిచెల్‌ సాంట్నర్‌, ఐష్‌ సోధి, రచిన్‌ రవీంద్రతో స్పిన్‌ విభాగం కూడా పటిష్టంగా ఉంది. ఈ జట్టులో బ్యాటింగ్‌లోనే లోటుపాట్లు తప్పా.. బౌలింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. అయితే తాజాగా జరిగిన వార్మప్ మ్యాచ్ లలో బ్యాటింగ్‌లో ఇరగదీస్తున్నారు. ఇక వీరి ఫీల్డింగ్‌ గురించి చెప్పనక్కర్లేదు. వరల్డ్‌ క్లాస్‌ ఫీల్డర్లంతా ఈ జట్టులోనే ఉన్నారు. అన్ని విభాగాల్లో ఇంత పటిష్టంగా ఉన్న ఈ జట్టును ప్రపంచకప్‌లో అన్ని జట్లు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.